Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఏపీసీపీఎస్ఈఏ చేయూత

ఏపీసీపీఎస్ఈఎ, సీపీఎస్ సభ్యుడు నాపా లక్ష్మీనారాయణ కుటుంబానికి ఆ సంఘం ఆర్థిక సాయం చేసింది. చిత్తూరు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు  వెంకటరమణ, తిరుపతి డివిజన్ అధ్యక్షులు, టీటీడీ కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ చీర్ల కిరణ్ తదితరులు లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. వివిధ జిల్లాల సంఘాల ఆర్ధికసాయం రూ.4,90,000లు అందజేశారు. గుంటూరు ఏపీసీపీఎస్ఈఎ రూ. 1,21,300లు, కృష్ణా జిల్లా సంఘం   రూ.1,20,500లు, విజయనగరం   రూ.78,000లు, ప్రకాశం సంఘం రూ.73,000లు, విశాఖపట్నం సంఘం రూ.52,200లు, తూర్పుగోదావరి  సంఘం రూ.37,500లు పశ్చిమగోదావరి సంఘం రూ.7,500లు అందజేశారు. ఈ మొత్తాన్ని లక్ష్మీనారాయణ  సతీమణి, కుమారుడు పేర .2,65,000లు, కుమార్తె పేర సుకన్య సమృద్ధి యోజనలో రూ. 1,25,000లు ,తల్లి అకౌంట్ కి డిపాజిట్   రూ.లక్ష, జమచేశామన్నారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కార్యవర్గ సభ్యులు అప్పలరాజు పార్థసారధి, బొడ్డు శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్, గుంటూరు జిల్లా అసోసియేట్ అధ్యక్షులుఎం. పాల్గొన్నారు.


ఎక్కువ మందిచదివినవి