Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఉద్యోగుల వైద్య బిల్లుల రీఎంబర్స్ ఉత్తర్వులు త్వరలో...

 

*ప్రభుత్వానికి లేఖ పంపిన ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో

*మినహాంపు మొత్తం ఇక  శాలరీ స్లిప్పుల్లోనూ..

 

(ఉద్యోగులు న్యూస్)

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్ల వైద్య ఖర్చులు రీయింబర్స్ చేసే గడువును మరింత కాలం పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు  ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో మల్లికార్జునరావు స్పష్టం చేశారు. ఏపీఐఐసీ కార్యాలయంలో బుధవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు జరిగిన ఆరోగ్యశ్రీ ట్రస్టు మేనేజిమెంట్ కమిటీ సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఇంతకుముందు సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలు- ఉద్యోగుల ఆరోగ్యకార్డులు, ఇతరత్రా అంశాలకు సంబంధించి ఆయన ప్రజంటేషన్ ఇవ్వగా  అందులో భాగంగా చర్చ జరిగింది. వైద్య బిల్లుల రీ యింబర్స్ గడువు మరింత పెంచాలని కోరుతూ ఈ నెల 5న ప్రభుత్వానికి లేఖ పంపినట్లు ఆయన వెల్లడించారు. గడువు ఏడాది పాటు పెంచాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందడం లేదని, నెట్ వర్కు ఆస్పత్రులు సరిగా స్పందించని కారణంగా  రీయింబర్స్ గడువు మూడు నెలలకే పరిమితం కాకుండా ఏడాది నాటెఒకేసారి పెరిగేలా చూడాలని వారు కోరారు.

కోవిడ్ కు రీయింబర్స్ మెంటు వర్తింపు

కోవిడ్ చికిత్సలకు సైతం రీయింబర్స్ మెంటు వర్తింపజేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ర్టంలోనే కాకుండా చెన్నయ్, హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల ఎక్కడ గుర్తింపు పొందిన, గుర్తింపు లేని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆ బిల్లులు  నిబంధనల మేరకు రీ యింబర్స్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని  ప్రభుత్వానికి ప్రతిపాదించారు.  త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు  కూడా రానున్నాయని అభిలషిస్తున్నారు.

ఆరోగ్య కార్డు ప్రీమియం ఇక శాలరీ స్లిప్పుల్లోనూ...

ఆరోగ్య కార్డుల నిమిత్తం పెన్షనర్ల నుంచి, ఉద్యోగుల నుంచి ప్రతి నెలా మినహాయించే మొత్తం వివరాలు, అలాగే ప్రభుత్వ వాటాగా ఇచ్చే మొత్తం వివరాలు ఇక వారీ శాలరీ స్లిప్పుల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  ఈ విషయాన్ని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించి ఖజానాశాఖ సంచాలకుల సాయంతో సంబంధిత కోడ్ సాయంతో ఇది అమలయ్యేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

రాష్ర్టంలో 16 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్య  స్మార్టు కార్డులు అందించనున్నారు. ఇందుకు టెండర్లు కూడా బుధవారమే ఖరారు చేశారు. కుటుంబ సభ్యులందరికీ ఒకే డిజిటల్ కార్డు ఉండేలా ఇది ఉంటుందని, దీని వల్ల కార్డుల వినియోగం సులభతరమవుతుందని చెబుతున్నారు. ఈ  సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఎక్కువ మందిచదివినవి