Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

18 నెలల బకాయిలకు చెల్లుచీటీ

*మళ్ళీ 2021 జూలై నుంచి డి ఏ.

(ఉద్యోగులు న్యూస్)

రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు మళ్ళీ 2021 జూలై 1 నుంచి కొత్త  డి ఏ వర్తించనుంది.అప్పటి ధరలకు అనుగుణంగానే కొత్త డి‌ఏ ప్రకటిస్తారు .ప్రస్తుతం కోత పెట్టిన 3 డి‌ఏ ల బకాయిలు సైతం ఇవ్వబోమని ఆర్ధిక శాఖ తేల్చి చెప్పింది .దీంతో 3 డి‌ఏ లకు పూర్తిగా కోత పడినట్లే .

 2020 జనవరి, జూలై  నెలలు2021 జనవరి నెలల్లో ఇవ్వవలసిన కరువు భత్యాన్ని నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ పరిస్తితి ఏర్పడింది . ఇటీవల 2018 జూలై 2019 జనవరి ,జూలై నెలల కరువుభత్యాన్ని  విడుదల చేసిన విషయం విధితమే. కోత విధించిన మూడు నెలల కరువు భత్యాన్ని జూలై 2021 నుండి కలిపి చెల్లించనున్నారు. అయితే నిలుపుదల చేసిన 2020 జనవరి నుండి 2021 జూన్ వరకు 18 నెలల కరువు భత్యం బకాయిలను మాత్రం ప్రభుత్వం చెల్లించదు.