Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

మూడో డీఏ 5.24శాతం గా నిర్ణయం

*మంత్రి మండలి  ఆమోదం

(ఉద్యోగులు న్యూస్)

 ఉద్యోగులకు  2019 జులై నుంచి పెండింగులో ఉన్న కరవు భత్యం 5.24శాతం మేర చెల్లించాలని  రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగులో ఉన్న మూడు డీఏలలో తొలి రెండు 3.144శాతంగాను, మూడో డీఏ  5.24శాతంగా  రాష్ర్ట మంత్రి మండలి శుక్రవారం ఆమోదించింది. మంత్రి మండలి నిర్ణయాలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు చెప్పారు.

తొలి  డీఏ అరియర్స్  30 నెలలవి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 2018 జులై నుంచి ఇవ్వాల్సిన  డీఏ  అరియర్స్  భారం రూ.3017  కోట్లుగా పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి జీతాలు, పెన్షన్లతో పాటు నగదు రూపంలో  చెల్లిస్తామన్నారు. ఈ డీఏ వల్ల  ఏడాదికి ప్రభుత్వంపై భారం రూ.1,206.96 కోట్లు పడుతుందని చెప్పారు.2019 జవనరి నుంచి పెండింగులో ఉన్న డీఏ అమలు వల్ల కూడా ఇదే మొత్తాలు ఖర్చవుతాయని పేర్కొన్నారు.

2019 జులై నుంచి అమలు చేయాల్సిన డీఏ 5.24శాతం చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ అరియర్స్ భారం రూ.5,028.90 కోట్లు పడుతుందన్నారు. మూడో డీఏ వల్ల ఏడాదికి ప్రభుత్వానికి రూ.2,011.56 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. మొత్తం మూడు డీఏల అరియర్స్ భారం  రూ.11 వేల కోట్ల పై  మాటే అని కన్నబాబు చెప్పారు.

ఎక్కువ మందిచదివినవి