Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

పీ ఆర్ సీ కోసమే ఒక్క డీఏ మంజూరు చేస్తారా?

*ఏపీ ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ

 

(ఉద్యోగులు న్యూస్)

కొత్త పీఆర్సీ అమలు- డీఏల మంజరుకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.  ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం ఒక డీఏ మంజూరు చేయాలని అనుకుంటున్నట్లుగా ఆ మేరకు నిర్ణయ తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 11 వ వేతన సవరణ నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగులో  ఉంది.   ఆ నివేదిక అధ్యయనం చేసేందుకు మరో  ఉన్నత స్థాయి కమిటీ  ఏర్పాటుకు సంబంధించిన ఫైలు  ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉంది. చాలా మంది ఉద్యోగుల్లో కనీసం రెండు డీఏల మంజూరు చేయాలన్న డిమాండ్  ఉంది.

ఫిట్మెంట్ తో  డీఏ అనుసంధానంపై చర్చ...

రాష్ర్ట ప్రభుత్వం పీ ఆర్సీ అమలు ప్రకటన సమయంలోనే ఫిట్మెంట్  నిర్ణయిస్తుంది. దాంతో  అప్పటి వరకు ఉన్న  కరవు భత్యం మొత్తాన్ని కలిపి వేతనాన్ని స్తిరీకరిస్తారు.  ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు  2018 జులై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాల్సి  ఉంది. ఇప్పటి వరకు మొత్తం అయిదు డీఏల అమలు పెండింగు లో ఉంది. రాష్ర్ట ప్రభుత్వం ఇంకా 2018 జులై 1 నాటికి ఇవ్వాల్సిన డీఏ మంజూరు చేయలేదు. అది (3.144శాతం)ఇప్పుడు మంజూరు చేస్తే ఇంతవరకు ఉన్న  డీఏ27.248శాతంతో కలిపి మొత్తం 30.392శాతానికి చేరుతుంది. ప్రభుత్వం వేతన సవరణ ఆ తర్వాతి నెల నుంచే అమలు చేయాల్సి ఉంటుంది. అంటే అప్పటి వరకు ఉన్న  డీఏ ఫిట్మెంట్ తో కలిపి మూలవేతనంతో కలపవలసి ఉంటుంది.  ఒక వేళ  రాష్ర్ట ప్రభుత్వం 32శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే (ఇది కేవలం ఊహాజనితంగా కడుతున్నలెక్క మాత్రమే. ఉద్యగో సంఘాలు 60శాతానికి ఫైగా ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నాయి) అప్పటి వరకు ఉన్న డీఏ 30.392తోశాతం  దీనికి కలిపితే 62.392శాతం మూలవేతనంతో  కలిపి  స్థిరీకరించాల్సి ఉంటుంది.  2018 జులై ఒకటి నాటికి ఉద్యోగికి ఉన్న మూలవేతనంతో అది కలిపి స్థిరీకరిస్తారు. ఒక వేళ రెండో  డీఏ అంటే 1.1.19 నాటికి ఇవ్వాల్సింది ప్రకటిస్తే కొత్త స్కేళ్లపై ఇవ్వాల్సి ఉంటంది.  అందువల్ల ఆర్థికశాఖాధికారులు అంతవరకు పరిమితమవుతూ ఒక డీఏ మంజూరుకు ప్రతిపాదిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. 

ఉదాహరణకు  1.7.18 నాటికి ఉద్యోగి మూలవేతనం రూ.55,410 అనుకుంటే 1.7.2018 నాటికి  డీఏ 3.144శాతం ఫిట్మెంట్ 32శాతం కలిపి (ఫిట్మెంటు ఊహాజనితం మాత్రమే) ఆ ఉద్యోగికి కొత్త వేతన సవరణలో రూ.89,981 వద్ద కొత్త  స్కేలు స్థీరీకరించవచ్చు. మాస్టర్ స్కేలులో తదుపరి స్థాయికి కూడా వేతనం వెళ్లి రూ.91వేలకు పైగా కూడా ఫిక్స్ చేయవచ్చు. ఈ మూలవేతనం  పైనే తదుపరి డీఏ,  ఇంటి అద్దె భత్యం తదితర అలవెన్సులు కలుపుతారు.

మూడు డీఏలు ప్రకటించినా అమలు కష్టమేమీ కాదు..!

అలాగని  పీ ఆర్సీ పెండింగులో ఉండగా  అంతవరకే డీఏ మంజూరు చేయాలని  ఏమీ లేదు. అంతకుమించి డీఏ లు ప్రకటించకూడదని, అమలు చేయకూడదని లేదు. ప్రభుత్వం,ఆర్థికశాఖ అధికారులు ఆ కోణంలో ఆలోచించి ఒక్క డీఏ అంటున్నారా అని ఉద్యోగుల్లో సాగుతున్న  ఆసక్తికర చర్చను ప్రస్తావిస్తున్నాం. ప్రస్తుతం మూడు డీఏలు మంజూరు చేసినా  ప్రస్తుత స్కేళ్లపై అమలు చేస్తారు. ఆనక  పీఆర్సీ అమలు తర్వాత కొత్త స్కేళ్లపై లెక్కలు కట్టి ఆ మేరకు సర్దుబాటు చేసి కొత్త డీఏ మొత్తం ఫిక్స్ చేస్తారు.

ఎక్కువ మందిచదివినవి