సార్వత్రిక  సమ్మెకు ఏపీ అమరావతి జేఏసీ దూరం

*బొప్పరాజు వెల్లడి

(ఉద్యోగులు న్యూస్)

 ఈ నెల 26న అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఏపీ అమరావతి జేఏసీ లో ఉన్న ఉద్యోగ సంఘాలు దూరంగా ఉంటాయని ఆ సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలతో   సమ్మె నిర్ణయానికి ముందు  ఎవరు సంప్రదించలేదని  ఆయన పేర్కొన్నారు. తమ సంఘంలోని 94 ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనడం లేదని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు ఉన్నందున, ఉద్యోగులకు సంబంధించి అనేక చట్టాలు అమల్లో ఉన్నందున ప్రస్తుత సమ్మెలో తాము   పాల్గొన్న లేమని ఆయన వివరించారు. రాష్ట్రంలో అనేక    తరహా లుగా నిరసన వ్యక్తం చేసిన తర్వాత చివరి అస్త్రంగా సమ్మె కు దిగుతామని బొప్పరాజు పేర్కొన్నారు.