Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

డ్రైవర్లు, నాల్గో తరగతి ఉద్యోగ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు

* ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి అండదండలు

*ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

 

 డ్రైవర్లు నాలుగో తరగతి ఉద్యోగుల వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.ఆర్. సూర్యనారాయణ, ఆస్కారరావులు ప్రభుత్వాన్ని కోరారు. ఆయా పోస్టులకు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరపాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర  సమావేశం శుక్రవారం జరిగింది. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు స

 సంసాని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. డ్రైవర్ల సంఘానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పరంగా వారికి రావాల్సిన రాయితీలు వచ్చేలా కృషి చేస్తామన్నారు.

 

 *సంఘటితం గానే ఉంటాం

 

డ్రైవర్ల సంఘం ఎప్పటికీ సంఘటితంగా ఉంటుందని ఎవరి కుట్రలకు చీలి పోదని డ్రైవర్ల కేంద్ర సంఘం అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంఘ నియమావళి ప్రకారం ఎన్నికలు విజయవంతంగా జరిగాయని విజేతలకు  సమావేశంలో శుభాకాంక్షలు  తెలిపారు. ఎలాగైనా మరోసారి ఎన్నికలు నిర్వహించాలనే సాకుతో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డీఎస్ కొండయ్య ప్రయత్నించారన్నారు. సంఘాన్ని చీల్చే కుట్రలో భాగంగా లీగల్ నోటీసులు ఇప్పించారని సంఘాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నందున కొండయ్యను సంఘ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు సంవత్సరాలపాటు తొలగిస్తున్నట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ సంఘానికి ఆయనకు ఎటువంటి సంబంధం లేదని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. సంఘటితంగా డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

 

 తీర్మానాలు

ఈ సమావేశంలో పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటినే తీర్మానం చేశారు.

 

 * డ్రైవర్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి.

* అద్దె ప్రాతిపదికన వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అనుమతించకూడదు.

*డ్రైవర్ల అందరికీ విధిగా యూనిఫామ్స్ అందచేయాలి.

* అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలి.

 *జీవో నెంబర్ 5 ను రద్దు చేయాలి

 *శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్లను నియమించాలి.

ఎక్కువ మందిచదివినవి