Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

పీఆర్ డిప్లొమో ఇంజినీర్లు ఇక సహాయ నిరాకరణ

*      15 నుంచి మూడు రోజుల పాటు ధర్నాలు

*       నిరసన కార్యక్రమాలు ఖరారు చేసిన సంఘం సమావేశం

 

పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న డిప్లొమో ఇంజినీర్లు ఇక సహాయ నిరాకరణ బాట పట్టాలని నిర్ణయించారు. సీసీ రోడ్ల నిర్మాణం విషయంలో  ప్రభుత్వం ఇచ్చిన మెమోలో తమపై వేధింపులు పెంచేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విజిలెన్సు, ఏసీబీ వేధింపులు ఎక్కువ చేస్తే తాము ఎలా పనులు చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్లు అసోసియేషన్ కార్యవర్గ సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. సంఘ అధ్యక్షుడు జి హనుమంతరావు అధ్యక్షత వహించి  మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ  ఈ నెల 15,  16, 17 తేదీల్లో అన్ని జిల్లాల్లోని  పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఆఫీసుల ముందు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వరుసగా మూడు రోజుల నిరసన ప్రదర్శన అనంతరం 18 న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామన్నారు.  అక్టోబరు  20 నుంచి నిరవధిక సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడతామన్నారు. జరుగుతున్న పనులు నిలిపివేస్తామని, కార్యాలయాల్లో ఆఫీస్ పని చేయబోమని హన్మంతరావు స్పష్టం చేశారు . ఇంజనీర్ల పై పనుల లక్ష్యాలను నిర్దేశించి, ఒత్తిడి పెడుతున్న కలెక్టర్ల చర్యలను నిరసిస్తున్నా మన్నారు. డిప్లొమో  ఇంజనీర్లుగా ప్రమోషన్లో అవకాశాలు మెరుగు పరచాలని, ఈజీ ప్రమోషన్లలో క్యాడర్ స్ట్రెంగ్తు అమలు చేయాలని, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు హోదా కల్పించాలని, ఈ పోస్టులను జీవో 15 లో చేర్చాలని, డిమాండ్ చేశారు. ఈ  సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె రవీంద్ర ఫైనాన్స్ కార్యదర్శి జి కేశవులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి  రాంబాబు, సహాధ్యక్షులు సత్యనారాయణ, ప్రసాదరావు జాయింట్ సెక్రటరీ లు ఎన్ చంద్ర నాయుడు, మురళీకృష్ణ, రత్న ప్రసాదు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

 

ఎక్కువ మందిచదివినవి