Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

సాయంత్రం 5 తర్వాత ఉద్యోగులతో సమావేశాలు వద్దు

*సెలవు రోజుల్లో కూడా

*అధికారులకు చెప్పిన ముఖ్యమంత్రి జగన్

*వెల్లడించిన ఉద్యోగుల నేత బొప్పరాజు

                    (ఉద్యోగులు న్యూస్)

ఉద్యోగులతో  పని దినాల్లో ఉదయం 10.3‌0 గంటల ముందు, సాయంత్రం 5 గంటల తర్వాత కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ ఉన్నతాధికారి ధనుంజయ్ రెడ్డికి తెలియజేశారని ఏపీ రెవెన్యూ సర్వీసు అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్బవర్గ  బృందంతో సహా బొప్పరాజు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తమ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని, వారి సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ధనుంజయ్ రెడ్డికి తెలియజేశారని బొప్పరాజు చెప్పారు.

ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్య కార్డులతో నగదు రహిత వైద్యం అందించే విషయంలో ఉద్యోగుల నుండి  ఎటువంటి వ్యతిరేకత రాకూడదని ముఖ్యమంత్రి  ఆదేశించినట్లు బొప్పరాజు తెలిపారు. రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలని పెరుగుతున్న జనాభా పని భారం బట్టి మండల డివిజన్ జిల్లా మరియు రాష్ట్రస్థాయి కార్యాలయల్లో అవసరమైన చోట సిబ్బందిని పెంచాలని కోరినట్లు చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు తో  పాటు  కొత్త మండలాలు అదనపు సిబ్బందిని మంజూరు చేయాలని  కోరినట్లు తెలిపారు. అన్ని కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త  కార్యాలయ నిర్మాణాలు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం జరుగుతున్నందున అతి త్వరలో భూముల సర్వే కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇతర శాఖల పనులు రెవెన్యూ శాఖకు అప్పగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ముఖ్యమంత్రికి పరిచయం చేసి మర్యాదపూర్వకంగా సీఎంకు చిరు సత్కారం చేసినట్లు బొప్పరాజు తెలిపారు. ఏపీ ఆర్ ఎస్ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి ,ఏపీ జేఏసీ అమరావతి కార్యదర్శి  వై వి రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ .రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహారావు  కె ఎస్ శర్మ, మాధురి  జి ప్రవీణ్ కుమార్ రెడ్డి  ఎస్ ప్రేమ కుమార్  ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.