Thursday 29th October 2020
ముఖ్యాంశాలు
  • నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు....రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • మాటిచ్చారు సరే ...రాసిద్దురూ!....సేవలు, సవాళ్ళలో నిత్యం పోరాటయోధులమే....విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టు
  • సంరక్షణ పథకం కింద చికిత్స చేయాల్సిందే....డబ్బులు వసూలు చేస్తే 10 పెనాల్టీ.....డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో
  • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు.....రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
  • ముఖ్యమంత్రి చెంతకు ఉపాధ్యాయుల సమస్యలు.........సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా..
  • కలిసి కదులుదాం.. వృత్తిలో ఎదుగుదాం...........ఏపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో స్ అసోసియేషన్
  • ఉపాధ్యాయుల సమ్మతితో విలీనం జరగాలి...ఏపీటీఎఫ్ 1938
  • ప్రత్యేక స్కూల్ అసిస్టెంట్లకు జీతాలు మంజూరు

ఉద్యోగుల కరోనా వైద్య ఖర్చులకూ రీయింబర్స్ మెంటు

*ఆరోగ్యశ్రీ మేనేజ్ మెంటు కమిటీ సమావేశంలో హామీ

*ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక వెల్లడి

(ఉద్యోగులు న్యూస్)

కరోనా వైద్యం సమయంలో ఉద్యోగుల ఆరోగ్య కార్డులు నిరాకరించినందున ఆ మొత్తాన్ని  రీ ఎంబర్స్ చేసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో సుముఖత వ్యక్తం చేశారని ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య  వేదిక వెల్లడించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మేనేజ్ మెంట్ కమిటీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత వారు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఐక్య వేదిక ఛైర్మన్ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి,  జోసెఫ్ సుధీర్ బాబు,జి. హృదయరాజు తదితరులు ఈ విషయం వెల్లడించారు.

ఉద్యోగులకు కరోనా సమయంలో ఆరోగ్య కార్డులు నిరాకరించి వైద్యం అందించని నెట్ వర్కు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని  ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక  డిమాండ్ చేసింది. ఐక్య వేదిక నేతలు బండి శ్రీనివాసరావు, షేక్ సాబ్జి, జి.హృదయరాజు, సోమేశ్వరరావు తదితరులు సమావేశానికి ముందే ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను క్రోడీకరించారు. వీటిని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో మల్లికార్జునరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.

ఐక్య వేదిక డిమాండు చేయగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ లభించింది.  ఆ  వివరాలు ఇలా ఉన్నాయి.

 *కోవిడ్-19 చికిత్స లో కార్డులను నిరాకరించి డబ్బులను దండుకొన్న ఆసుపత్రులపై చర్యలు.

*కార్డులపై వైద్యం నిరాకరించినందున  ఉద్యోగులకు ఆ మొత్తం రికవరీ చేసేందుకు పరిశీలన.

*మెడికల్ రియింబర్స్మెంట్ కొనసాగింపు ఉత్తర్వులు త్వరలో జారీ  చేసేందుకు హామీ. కోవిడ్ కు వర్తించేందుకు పరిశీలన.

 *ఉద్యోగుల ఆరోగ్య కార్డుల నిబంధనల ప్రక్రియ పూర్తి చేసుకున్న  ఎయిడెడ్ , మోడల్ స్కూల్, గురుకుల విద్యాలయాలు,  గ్రంథాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలో కొత్త కార్డుల జారీ

 *పెండింగ్ లో ఉన్న 3,800 మెడికల్ బిల్లులను త్వరలో మంజూరుకు హామీ.

 *విద్యా శాఖలో మెడికల్ రియింబర్స్మెంట్ ప్రక్రియ త్వరలో సులభతరం చేసేందుకు హామీ.

*గతంలో కాలిపోయిన మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు 212 లో ప్రస్తుతానికి 65 వరకు మంజూరుకు సానుకూలం.

* ఉభయగోదావరి జిల్లాల్లోని  7 మండలాల్లోని  టీచర్లకు ఆరోగ్య కార్డుల జారీకి ప్రక్రియ వేగవంతం చేస్తామని మేనేజ్ మెంటు కమిటీ సమావేశంలో హామీ లభించిందని జేఏసీ పేర్కొంది.