Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

డైరక్టర్ తో చర్చల్లో వాడీ, వేడీ...

*పోస్టులు బ్లాక్ చేయడానికి సంఘాల ససేమిరా

*రోల్ కన్నా  ఎక్కువ ఉంటే బదిలీ తప్పదు

*మిగిలిన ఎస్టీజీలను రోల్  ఎక్కువ ఉన్న చోట సర్దుతాం

*డైరక్టర్ వెల్లడి

*మాన్యువల్ కౌన్సెలింగుపైనా చర్చ

*పాజిటివ్  ఉన్న వారు వస్తే ఎలా అని వీరభద్రుడి ప్రశ్న..

*కొనసాగుతున్న సమావేశం

 

(ఉద్యోగులు న్యూస్)

ఉపాధ్యాయ పోస్టులను కొన్నింటిని బ్లాక్ చేసి బదిలీలు జరుపుతామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఉపాద్యాయ సంఘాలు స్పష్టం చేశాయి.  మాన్యువల్ కౌన్సెలింగు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశాయి. విద్యాశాఖ డైరక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడితో విజయవాడలో జరుగుతున్న సమావేశంలో అనేక అంశాలపై కాస్త వాడి, వేడిగానే చర్చ సాగుతున్నట్లు సమాచారం. అనేక అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. కొన్ని అంశాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తంగా కాగా  వెళ్తే కోర్టుకు వెళ్లండి అని కూడా  డైరక్టర్ అన్నట్లు సమాచారం.  ఈ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి అందిన సమచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...

మాన్యువల్ కౌన్సెలింగు పెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా కోరాయి. ఒక టీచరు వేల ఆప్షన్లు ఎలా పెట్టగలరని ప్రశ్నించాయి. కౌన్సెలింగులో పాజిటివ్ ఉన్న వ్యక్తి వస్తే ఎలా అని డైరక్టర్ ప్రశ్నించారు. అలాంటి పక్షంలో  సెకండరీ గ్రేడ్ టీచర్లకైనా మాన్యువల్ కౌన్సెలింగు నిర్వహించాలని కోరారు. పరిశీలిస్తామని డైరక్టర్ చెప్పారు.

ఒక్క టీచరు పోస్టు రద్దు కాదు...

రేషన్ లైజేషన్ ప్రక్రియలో ఒక్క టీచరు పోస్టు రద్దు కాదని డైరక్టర్ చెప్పారు. రెండు మీడియంలకు టీచర్లు కావాలంటే ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 87 వేల ఎస్జీటీ టీచర్లతోనే రేషన్ లైజేషన్ ఉంటందని, ఎక్కడైనా మిగిలితే వారిని రోల్ ఎక్కువ ఉన్న స్కూళ్లకు పంపిస్తామని చెప్పారు. రోల్ లేకుంటే అక్కడి నుంచి బదిలీ తప్పదని చెప్పారు. ప్రతి స్కూలుకు ఇద్దరు టీచర్లు ఉంటారు అని అన్నారు. డైట్ లో కూడా టీచర్లను కొనసాగిస్తామని డైరక్టర్ వెల్లడించారు.

పండిట్ లకూ ప్రమోషన్లు

భాషా పండితులకు కూడా ప్రమోషన్లు ఇచ్చి స్కూలు అసిస్టెంట్లుగా నియమిస్తామని చినవీరభద్రుడు  చెప్పారు. మిగిలిన వారిని ప్రాథమికోన్నత  పాఠశాలల్లో సర్దుబాటు చేస్తామని చెప్పారు. ప్రతి తరగతికి ఒక టీచరును ఇవ్వాలంటే ప్రభుత్వం పోస్టులు మంజూరు చేయాలన్నారు.

ఎక్కువ మందిచదివినవి