Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఖాళీలు బ్లాక్ చేయబోమని డైరక్టర్ హామీ

*సర్వీసు పాయింట్ల పెంపు లేదు

*మిగిలిన అంశాలు సీఎం దృష్టికి ...

*వాడ్రేవు చినవీరభద్రుడి వెల్లడి

*ఫ్యాప్టో ప్రకటన,,. దీక్షల విరమణ

 

(ఉద్యోగులు న్యూస్)

పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడితో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సానుకూలంగా జరిగాయని ఫ్యాప్టో ప్రకటించింది. పోస్టులు  ఏవీ బ్లాక్ చేయబోమని డైరక్టర్ స్పష్టం చేశారని తెలిపింది. మిగిలిన అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పినందున ప్రస్తుత ఫ్యాప్టో దీక్షలు నిలిపివేయాలని నిర్ణయించింది. తదుపరి పరిస్థితిని బట్టి కార్యాచరణ ఉంటుంది. డైరక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చిన విషయాలు ఇలా ఉన్నాయి...

ప్రాథమిక పాఠశాలలు - 1:20 నిష్పత్తి సీఎంకు నివేదన

- మేన్యువల్ కౌన్సిలింగ్  పరిశీలనకు హామీ  , యస్.జి.టి. వరకు అయినా మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ

- ఖాళీలు - బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం

- అడ్ హాక్ పదోన్నతులు - సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం

 - సర్వీస్ పాయింట్లు - 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం

- అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కమిషనర్  హామీ

ఎక్కువ మందిచదివినవి