Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

బదిలీలు హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో సవరణ కోసం..

*కమిషనరుకు పి‌ఎస్‌టి‌యూ  ప్రతిపాదనలు

 

ఉపాధ్యాయుల బదిలీలు హేతుబద్ధీకరణ కు సంబంధించి.  ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జమాల్ రెడ్డి  ఆధ్వర్యంలో పాఠశాల విద్య కమిషనరుకు  పి‌ఎస్‌టి‌యూ  పలు ప్రతిపాదనలు చేసింది.   జీవో53 ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందనిఉత్తర్వులలో సవరణలు  చేయాలని కోరారు. 

గత బదిలీల్లో రేషనలైజేషన్ చేసినవారిని మినహాయించాలని కోరారు. ప్రస్తుత బదిలీల్లో  రేషనలైజేషన్ లో జీవో 53 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 60 నుండి 90 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఆ తర్వాత ప్రతి 30 కి ఉపాధ్యాయులు కేటాయిస్తూ 150 మందికి ఒక లో ఫిమేల్  ప్రధానోపాధ్యాయుని  కేటాయించారన్నారు.  గతంలో  2017 జరిగిన బదిలీల్లో రేషన్ ఉత్తర్వుల ప్రకారం 80 మంది విద్యార్థులు ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి  నలుగురు సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులు (అందులో ఒక సబ్జెక్టు ఉపాధ్యాయుడు) మరియు  ఒక లో ఫిమేల్ లిటరసీ ప్రధానోపాధ్యాయులు  మొత్తం ఐదు మందిని నియమించారని గుర్తుచేశారు. అందుకే ప్రస్తుతం  మోడల్ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను రేషనలైజేషన్ చేయకుండా, గతంలో 2017 లో  రేషనలైజేషన్ చేసిన పోస్టులన్నీ అబేయన్స్ కింద ఉన్న వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారుల దగ్గర ఉన్నాయని  వాటిని ఏకోపాధ్యాయ పాఠశాల కు కేటాయించాలని సూచించారు.   మోడల్ ప్రాథమిక పాఠశాల ను నిర్వీర్యం చేసి ఉపాధ్యాయులను ఏకోపాధ్యాయ పాఠశాలలకు కేటాయించడం సరైన నిర్ణయం కాదన్నారు.  మోడల్ స్కూల్ లో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం   80 మందికి నలుగురు ఉపాధ్యాయులు ఒక లో ఫిమేల్ డ్రె ప్రధానోపాధ్యాయుని కొనసాగించాలన్నారు‌. ప్రాథమిక పాఠశాలలో 1: 20 ప్రకారము లేదా1:25 పోస్టులు విధంగా రేషనలైజేషన్ ఉత్తర్వులు సవరించాలని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీడియా వారిగా  పోస్టులు కేటాయించాలని కోరారు. 

ప్రస్తుత రేషనలైజేషన్  జీవో 53 లో రెండు వందల వరకు తెలుగు మీడియమునకు 9 పోస్ట్లు కేటాయిస్తూ , ఇంగ్లీష్ మీడియమునకు  లాంగ్వేజెస్ కేటాయించకపోవడంతో, ఒక పోస్టుతో రెండు మీడియంలలో విద్యార్థులను ఒకే సెక్షన్ గా పాఠ్యాంశాలను ఏ విధంగా బోధిస్తారని, నాణ్యమైన విద్య ఎలా అవుతుందనే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలన్నారు. రేషనలైజేషన్ లో N.C.C., ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలన్నారు. గతంలో ఒకసారి రేషనలైజేషన్ కింద బదిలీ అయిన లేదా రెండు సంవత్సరాలు ఒకే పాఠశాలలో పూర్తికాలం పని చేయకుండా ఉంటే అటువంటి వారికి సర్వీసుతో నిమిత్తం లేకుండా మినహాయింపు ఇవ్వాలని.

అంగవైకల్యం కలిగిన ఉపాధ్యాయులకు 40 శాతం నుండి  70 శాతం ఉన్న వారికి పాయింట్స్  ఇచ్చి , ఒక రకంగా, 70 శాతం ఒక పైన ఉన్న  వారికి ప్రాధాన్యత ప్రాధాన్యత  కేటగిరిలో చేర్చడం ఒక రకంగా వివక్ష చూపారని ఇది అసంబద్ధమన్నారు.

2019 వ సంవత్సరం లో ప్రమోషన్లు మరియు అప్గ్రేడ్ వల్ల ప్రమోషన్ పొందిన పోస్టులు ఖాళీగా చూపించాలని, వృత్తి విద్యా ఉపాధ్యాయుల బదిలీలు నిలుపుదల చేయాలని కోరారు. వృత్తి విద్యా ఉపాధ్యాయులు GO .No 31,38,84 ప్రకారం 2009లో రెగ్యులర్ అయిన తర్వాత 2017 సంవత్సరం బదిలీలలో వృత్తి విద్యా ఉపాధ్యాయులను కూడా రాష్ట్ర విద్యాశాఖా చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆనాటి ప్రాంతీయ విద్యా సంచాలకులు శ్రీ బండ్ల ప్రతాప్ రెడ్డి గారు, డైరెక్టరేట్ అధికారులతో చర్చించి డం తో వృత్తి విద్యా ఉపాధ్యాయుల బదిలీలను అనాటి డైరెక్టర్ గారు నిలుపుదల చేయించారు. 55 సంవత్సరాలు, ఆపై దాటిన ఉపాధ్యాయులకు, దీర్ఘకాలిక వ్యాధులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటునందున వారికి ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించాలని  పి‌ఎస్‌టి‌యూ   ప్రతిపాదించింది.

ఎక్కువ మందిచదివినవి