Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

గురువుల మాట విన్నారు..

*కమిషనర్ తో ఉపాధ్యాయ సంఘాల  సమావేశం

*బదిలీల ప్రక్రియపై చర్చ

*పి‌ఆర్‌టి‌యూ ఏ‌పి 

పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడుతో ఉపాధ్యాయ సంఘాల  సమావేశం జరిగింది.   బదిలీలు హేతుబద్ధీకరణ ఉత్తర్వులకు సంబంధించి  వివిధ సంఘాలు  ప్రతిపాదనలు చేస్తుండగా  వారి మాట వినేందుకు కమిషనర్ఈ సమావేశం నిర్వహించారు .   ఉపాధ్యాయ నేతల  ప్రతిపాదనలు విన్న కమిషనర్   కొన్నిటికి సానుకూలంగా స్పందించారు.  మరికొన్నింటికి  సంబంధిత యంత్రాంగంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  ఈ మేరకు పీఆర్టియు ఏపీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ ఎన్ గిరిప్రసాద్ మల్లు శ్రీధర్ రెడ్డి  వివరాలు తెలిపారు.

ప్రాధమిక పాఠశాలకు 2 పోస్టులు ఇవ్వడం వలన 1:20 నిష్పత్తి ప్రకారం ప్రాధమిక పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించలేము. సర్దుబాటు పూర్తి అయిన తరువాత ఎస్.జి.టి పోస్టులు మిగిలితే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తామని మిగిలిన ఖాళీలను బట్టి 60 లోపు ఉన్నంతవరకు కేటాయించే అవకాశం ఉందని  కమిషనర్  తెలిపారు.   

 విద్యార్థుల వివరాలు చైల్డ్ ఇన్ఫో లో నమోదు పూర్తి కానందున మాన్యువల్ గా విద్యార్థుల వివరాలు తీసుకోవాలనే  అంశాన్ని పరిశీలిస్తామన్నారు.బదిలీలకు ముందు చేపట్టబోయే పదోన్నతులలో అక్టోబర్, నవంబర్ నెలల్లో పదవీవిరమణ చేయబోయే వారికి స్ధానాలు కేటాయిస్తామని, మిగిలిన పదోన్నతి పొందిన వారికి బదిలీల అనంతరం మిగిలిన ఖాళీలు కేటాయిస్తానని తెలిపారు.  పండితుల పదోన్నతులు చేపట్టి అందులో యం.ఏ తెలుగు, 3వ మెథడాలజీ వారిని అనుమతించాలని కోరగా యం.ఏ తెలుగు, 3వ మెథడాలజీ వారిని పరిగణనలోకి తీసుకుంటామని కమీషనర్  స్పష్టం చేశారు.   ఎస్ జి టి లకు వెబ్ కౌన్సెలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ కోరగా పరిశీలిస్తామన్నారు . హెచ్ఎంలకు ఆర్జేడీ ద్వారా, యస్.ఏ లకు డిఇఓ ద్వారా, యస్.జి.టి లకు డిప్యూటీ ఇఓల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించాలని, యస్.జి.టీ లకు మొదట మండలాలకు కేటాయించి  కౌన్సిలింగ్  జరపాలని ఉపాధ్యాయులు  కోరారు‌. 

బదిలీలలో పోస్టులు బ్లాక్ చేయడం వలన సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతారన్నారనే  అంశంపై . కార్యదర్శితోచర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  పండిట్,పిఇటీ ఉన్నతీకరణ పోస్టులను, నెలవారీ పదోన్నతుల పోస్టులు, 2018 డీఎస్సీ నియామకాల పోస్టులను ఖాళీలుగా చూపాలని కోరగా మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని   కమిషనర్ చెప్పారు.

ఎక్కువ మందిచదివినవి