Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

బడిమారతామోచ్...!

 ఇక బదిలీల ఊసులే.. 

*జిల్లా ఎంపిక కమిటీలకే పూర్తి బాధ్యతలు

*రాష్ర్ట స్థాయిలో డైరక్టర్ కు అధికారాలు..

*కోరుకున్న నిబంధనలు ఏవీ అంటూ నిట్టూర్పులు

*దీక్షలు కొనసాగించనున్న ఫ్యాప్టో

 

   (ఉద్యోగులు న్యూస్)

బదిలీలంటే ఉపాధ్యాయుల్లో సందడి. అర్హత ఉంటే అనుకున్న చోటులో కొలువు దీరాలని కల. ఆర్ధికేతర అంశాలతో ముడిపడిన ఈ డిమాండును సకాలంలో నెరవేర్చాలని అనేక సార్లు  గురువులు గొంతులు సవరించారు... వినతి పత్రాలు సంధించారు. వీటన్నిటికీ ముగింపుగా బదిలీల మార్గదర్శకాలు, క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు చర్చ అంతా వీటిపైనే.!  ఈ విద్యాసంవత్సరం బడి వాకిట్లో ఎన్నో మార్పులు.  కరోనా  నుంచి బయటపడి  బడిలో కోలాహలం మొదలవ్వడానికి ముందే అన్నీ సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  వసతులు, విద్యార్థులకు వనరులనే కాదు బదిలీల ప్రక్రియ పూర్తిచేసి  గురువులను సిద్ధం చేస్తోంది. ఇందుకు పాత మార్గదర్శకాలకు పదును పెడుతూనే    ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో  ఉపాధ్యాయులను సర్ధుబాటు చేయడం ద్వారా విద్యార్ధి ఉపాధ్యాయ నిష్పత్తి కుదిరేలా బదిలీల ప్రక్రియ చేపట్టడం ... ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మార్గదర్శకాల ముందుమాట!   విద్యార్థుల సంఖ్యను బట్టి  ఉపాధ్యాయుల పునర్విభజన ఉంటుందనే   ఆదేశాలతో ఉపాధ్యాయుల కొరతను అధిగమించే వీలుంటుందని అధికారులు అంటున్నారు. 

తాము కోరుకున్న నిబంధనలు వీటిలో చేర్చలేదని ఫ్యాప్టో ప్రకటించింది. సోమవారం ప్రారంభించిన రిలే దీక్షలు కొనసాగించాలని పిలుపునిచ్చింది.  గతంలో మాదిరి   ప్రధానోపాధ్యాయుల గ్రేడ్ -2 మరియు ఎపి స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ , ఎ, పి స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీసెస్‌లోని ప్రభుత్వ,  జెడ్‌పిపి, ఎంపిపి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు  బదిలీలు చేస్తారు  డీఎస్ఈ ద్వారా బదిలీల ప్రక్రియ జరుగుతుంది. . 

ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా ఉపాధ్యాయుల బదిలీ కోసం దరఖాస్తుల  స్వీకరిస్తారు.  బదిలీ స్థానాలు   సరిగా ఎంచుకోవడానికి  వెబ్ కౌన్సెలింగ్   ఉంటుంది. ఇందుకు  షెడ్యూలు ప్రకటిస్తుంది. , దరఖాస్తుల సమర్పణకు సమయం, ఉపాధ్యాయులు పొందే  పాయింట్ల  ధృవీకరణతో సహా అన్ని వివరాలను నిర్ధారిస్తుంది.. కౌన్సెలింగ్, సమస్యల  పరిష్కారం, ఉత్తర్వుల జారీ అనంతరం  ఆయా ప్రదేశాలలో  ఉపాధ్యాయుల చేరేవరకు  జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్ఈ)దే బాధ్యత.

*ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా తమ దరఖాస్తులను  ఇండిక్  కేటాయించిన ఐపీ  చిరునామాలో సమర్పించాలి.  ఉపాధ్యాయుల బదిలీల ప్రయోజనం కోసం, ఏ పాఠశాలలోనైనా అవసరమైన ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు  యూడైస్, చైల్డ్ ఇన్ఫోలో ఉంటాయి.

 

* బదిలీ మార్గదర్శకాలు  సక్రమంగా అమలు చేయడానికి, అవసరమైతే,  సమస్యలను పరిష్కరించడానికి  అధికారం.డీఎస్ఈదే.  అవసరమైతే, మార్గదర్శకాలను సవరించడానికి .   సమయ షెడ్యూల్‌తో సంబంధం లేకుండా, పరిపాలనా ప్రాతిపదికన, అవసరమైతే, ఉపాధ్యాయుల బదిలీని ప్రభావితం చేసే అధికారాన్ని ప్రభుత్వంలోని పాఠశాల విద్య విభాగానికి ఉంది. ఉపాధ్యాయుల సేవలను సరైన చోట  వినియోగించేలా  చూడటానికి,  పాఠశాలల మెరుగైన విద్యనందించేనుకు  పాఠశాల విద్య డైరెక్టర్ కూడా డైట్స్ లో బదిలీలను చేపడతారు.

* మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ / గిరిజన సంక్షేమ శాఖ కూడా ఈ విషయంలో అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయవచ్చు.

*  రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, సమగ్రా శిక్ష, ఎ.పి., సమగ్రా శిక్షలో బదిలీలను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

ఎక్కువ మందిచదివినవి