Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

వైద్యులకు  సామర్ధ్య పరీక్షా?

*పాలనాధికారులకు తోచినది అమలు చేస్తారా?

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

*వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ

 

ఏళ్ల తరబడి వైద్యం చేస్తున్నడాక్టరుకు ప్రతి రోగీ ఒక పరీక్షేనని వారి సామర్ధ్యాన్ని ప్రత్యేకించి కొలవాల్సిన పని ఏముందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( ఏపీజిఈఏ) ప్రశ్నించింది. సర్వీస్ నిబంధనల్లో లేని వైపరీత్యాలకు తూర్పుగోదావరి జిల్లాలో పాలనాధికారులు శ్రీకారం చుడుతున్నారని తప్పు పట్టింది . ఇప్పటికే ప్రజారోగ్యానికి భరోసా ఇస్తూ సేవల్లో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ (ఎన్‌హెచ్‌పి) మరియు ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ల మెడికల్ ఆఫీసర్ల,  ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సామర్థ్యాలను నిర్ధారించడానికి పరీక్షను నిర్వహించాలన్న ప్రతిపాదనపై విస్మయం చెందుతున్నామని ఏపీజిఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ఆర్ సూర్యనారాయణ, జీ ఆస్కారరావులు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఐటీడీఏ పరిధిలో వైద్యులకు  పీఓ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకత వచ్చిందని , జిల్లా అంతటికి వర్తింప చేయాలని,  ఉన్నతాధికారులు ఏకం అయ్యారన్నారు. ఈ నెల 22న నిర్వహించే పరీక్షను పీహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ బహిష్కరిస్తున్నారని స్పష్టం చేశారు.

వైద్య వృత్తిలోనే నిమగ్నమైన వారికి రోజూ సవాలే, ప్రతి అనారోగ్య పరిస్థితి విషమ పరీక్షగానే ఉంటుందని, వారికీ నైతికంగా యంత్రాంగం నిలవాల్సింది పోయి పరీక్షల పేరుతో అధికారులు కక్షసాధింపులకు పాల్పడకూడదని హితవు పలికారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఏపీజిఈఏ తరపున ఒక లేఖను అందచేశారు.  వైద్యుల సర్వీస్ నిబంధనల్లో లేని కొందరు అధికారుల స్వార్థ పూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పీహెచ్సీ డాక్టర్లకు పరీక్షను రద్దు చేయాలనీ లేఖలో స్పష్టం చేసారు.ఈ కార్యక్రమం లో ఏ‌పి‌జి‌ఈ‌ఏ  జిల్లా అధ్యక్షులు  పాము శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఎం‌వి‌వి  సత్యనారాయణ, రాష్ట్ర డ్రైవర్లు సంఘ  అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, డా శ్రీనివాస రాజు, భారీగా వైద్యులు పాల్గొన్నారు


ఎక్కువ మందిచదివినవి