Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ప్రవీణ్ ప్రకాష్ తో  ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత 

*కె.ఆర్. సూర్యనారాయణ భేటీ

*        ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు

*        5 అంశాలపై వివరించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంరాష్ర్ట అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ రాష్ర్ట ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను గురువారం రాత్రి కలిశారు. ఉద్యోగుల సమస్యలపై ఆయన మంగళవారం అనేక అంశాలు లేవనెత్తిన  నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.  దీంతో  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ప్రవీణ్ ప్రకాష్ ను కలిశారు. ప్రధానంగా అయిదు అంశాలు ఉద్యోగులవి పరిష్కరించాల్సి ఉందని తెలియజేశారు.  కరోనా నేపథ్యంలో రెండు నెలల పెండింగు జీతాలు, పెండింగులో ఉన్న పెన్షన్లు వెంటనే చెల్లించాలని  కోరారు. ఇంతవరకు 5 డీఏలు పెండింగులో ఉన్నాయని, కనీసం రెండు డీఏలు వెంటనే చెల్లించాలని సూర్యానారాయణ  డిమాండ్ చేశారు. పీఆర్ సీ  నివేదికను తక్షణమే తీసుకుని ఫిట్మెంటు నిర్ణయించి అమలు చేయాలని కూడా ఆయన ప్రవీణ్ ప్రకాష్ కు తెలియజేశారు. సీపీఎస్ రద్దు అంశాన్ని పరిశీలించి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రప్పించుకుని తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరో వైపు కాంట్రాక్టు, కంటింజెన్సీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముఖ్యమైన అంశమేనని అది కూ డా ఎలాంటి ఆలస్యం లేకుండా  పరిష్కరించాలని , వారిని క్రమబద్థీకరించాలని కోరారు.

 

ఎక్కువ మందిచదివినవి