7న సచివాలయ ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు
(ఉద్యోగులు న్యూస్)
సచివాలయ ఉద్యోగులు జనవరి 7న సంక్రాంతి సంక్రాంతి సంబరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సహాకారంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ సచివాలయ పార్కింగ్ ప్రదేశంలో ఈ సంబరాలు నిర్వహిస్తారు. ముగ్గులు పోటీలతో ప్రారంభమై
సంక్రాంతి విశేషాలు కళ్లకు కడుతూ కార్యక్రమాలు, సంగీత విభవరి అనంతరం విందుతో వేడుకలు ముగుస్తాయి. ఈ సంబరాల్లో ఉద్యోగులు అందరూ పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె. వేంకట రామిరెడ్డి కోరారు.