తీర్పుతో తేరుకున్నాం

(ఉద్యోగులు న్యూస్)

స్థానికసంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ జేఏసీ  అమరావతి హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నిర్వహణపై తీసుకున్న నిర్ణయం వలన ఉద్యోగుల ఆందోళన తొలగిందన్నారు.
ఏపి జేఏసి నేతలు  బొప్పరాజు, వైవీ రావు లు మాట్లాడుతూ.. ధర్మం పక్కనే న్యాయం ఉంటుందని ఈ తీర్పు ఋజువు చేసింది. కేవలం లక్షలాది మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత కోర్టులు తీసుకున్నందుకు కోర్టు తీర్పులపై అందరికి గౌరవం పెరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ తీర్పు పై బెంచ్ కి వెళ్లొచని  పంతాలకు పోయి ప్రజల మరియు ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం అడవద్దని కోరారు. రాజకీయ పార్టీలయొక్క స్వలాభాల కోసం ఉద్యోగుల, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమని తెలియచేస్తున్నాము అని తెలిపారు. ఈ తీర్పును ఎస్ఈసీ , ఇంకా వేరే ఫోరాలపై అప్పీల్ కు వెళ్లకుండా, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడాలని గవర్నర్ ను కలుస్తామన్నారు.