Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

 12శాతం  వడ్డీ .....? 

 

 

కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో పెండింగు పెట్టిన ఏపీ ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయబోతోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో  ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయి. వీరి పెండింగు జీతాలకు సంబంధించి ఒక జిల్లాకు చెందిన విశ్రాంత మేజిస్ట్రేట్ రాష్ర్ట హైకోర్టును ఆశ్రయించి విషయం తెలిసిందే .  పెండింగు జీతాలు 12శాతం వడ్డీతో సహా రెండు నెలల్లోగా చెల్లించాలని రాష్ర్ట  హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెండింగు జీతాలతో పాటు 12శాతం వడ్డీ అంశమూ చర్చనీయాంశమవుతోంది. రాష్ర్ట ప్రభుత్వం ఆ వడ్డీ చెల్లించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చింది. అప్పట్లోనే కొందరు ఉద్యోగ సంఘం నాయకులు కూడా12శాతం వడ్డీ అవసరం లేదని, పెండింగు జీతాలు ఇస్తే చాలని ప్రకటించారు. వడ్డీ ఇవ్వడానికి సుముఖంగా లేని ప్రభుత్వం ఈ విషయంలో కోర్టు ఉత్తర్వుల నుంచి ఏ విధంగా వెసులుబాటు పొందుతుందనే చర్చ ఉంది. ప్రస్తుం పెండింగు జీతాల జీవో విడుదలైన తర్వాత హైకోర్టులో ఇందుకు సంబంధించిన కౌంటర్ దాఖలు  చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా కారణంగా రాష్ర్ట ప్రభుత్వ ఆదాయాలు తగ్గిపోవడం వల్లే  ఉద్యోగుల జీతాల్లో కోత విధించాల్సి వచ్చిందని, ఇప్పటికీ  రాష్ర్ట  ఆదాయాలు పూర్తిగా కుదురుకోలోదని తెలియజేయనున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎక్కువ మందిచదివినవి