ముఖ్యమంత్రి ముందుకు ఉద్యోగుల సమస్యలు...

 

* సీఎం ని కలిసిన చంద్రశేఖర్ రెడ్డి ఇతర నేతలు

* ఏపీజేఏసీకి సీఎం భరోసా


 ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి , సెక్రటరీ జనరల్ సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు నేతృత్వంలో ఏపీజేఏసీ ప్రతినిధులు మంగళవారం కలిశారు. జెఎసి డైరీలను క్యాలెండర్ సీఎం ఆవిష్కరించారు.ఎస్టియు, యూటిఎఫ్ , ఏపిటిఎఫ్ 1938, ఆర్టీసీ (ఎన్ఎంయూ) ఏపీ డిప్లమా ఇంజినీర్స్ అసోసియేషన్ డైరీలను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను అవసరాలను ఏపీజేఏసీ సారథులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 55 శాతం సెగ్మెంట్లో పిఆర్సీ అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మంత్రుల బృందం ఇచ్చిన నివేదికపై తక్షణ నిర్ణయాలు తీసుకొని సిపిఎస్ రద్దు చేసి పాత విధానాన్ని అమల్లోకి తేవాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులు తాలూకా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒకేచోట తొమ్మిది సంవత్సరాలు పని చేయవచ్చనే నిబంధన పునరుద్ధరించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉపాధ్యాయునిలతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు ఐదు రోజుల అదనపు ఆకస్మిక సెలవు మంజూరు చేయాలని  విన్నవించారు. కోవిడ్  సోకిన అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సర్వీస్ 40 సంవత్సరాలకు పెంచాలని ముఖ్యమంత్రిని కోరారు. కమర్షియల్ టాక్స్ ఆఫీస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ గెజిటెడ్ హోదా కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కనిపించకుండా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ జేఏసీ అందించిన వినతులను స్వీకరించారు. ఉద్యోగ సమస్యలపై చర్చిస్తానని,   న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఏపీ జేఏసీ జోసెఫ్ సుధీర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బాబురెడ్డి హృదయ రాజు,హరనాథ్, వై శ్రీనివాసరావు రఘునాథ రెడ్డి తదితరులు ఉన్నారు.