సి పి ఎస్ పై ముఖ్యమంత్రి ఆ దేశం ఇదీ.. 

* ఉద్యోగులతో  భేటీ అవ్వండి

* మీ  ఆలోచనలు వారి ముందు ఉంచండి
* ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోండి
* అధికారులతో జగన్

( ఉద్యోగులు న్యూస్)

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం  పై ముఖ్యమంత్రి జగన్  గురువారం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై అధ్యయనం చేసిన అధికారులు ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి   రావత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు  సిద్ధం చేసిన మార్గ సూచి  పై ముఖ్యమంత్రి వివరంగా  తెలుసుకున్నారని సమాచారం. ఈ విషయాలపై ఉద్యోగ సంఘాల నాయకుల తో సమావేశం కావాలని వారి
 అభిప్రాయాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. ఇంతకుముందు సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం  ఉద్యోగులు పాటిస్తున్న సమయంలో ముఖ్యమంత్రిని కొందరు  నాయకులు కలిశారు. అప్పట్లోనే సీఎం జగన్ ఈ విషయం నాయకులకు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఒక
 ప్రజెంటేషన్ ఇస్తారని నాడు సీఎం తెలిపారు అప్పటి నుంచి  ఈ సమావేశం జరగలేదు ముఖ్యమంత్రి  ఆదేశం మేరకు త్వరలోనే అధికారులు ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.