Tuesday 24th November 2020
ముఖ్యాంశాలు
  • విస్తరిస్తున్న రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్
  • బడులు తక్షణం తెరవాలి
  • సమగ్ర శిక్ష అభియాన్ లోసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • సార్వత్రిక సమ్మె నాడు ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరు
  • ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా రవికుమార్
  • అఖిల భారత సమ్మెకు ఏపీ టి ఎఫ్(257)మద్దతు
  • జాయింట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిఉద్యోగుల సమస్యలపై చర్చించాలి
  • సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మద్దతు

విద్యుత్తు ఉద్యోగుల జేఏసీకి  మరో మారు చర్చలకు ఆహ్వానం

*సమ్మె, నిరసనలు వాయిదా వేసుకోవాలని వినతి
* ఏపీ ట్రాన్స్ కో  సీఎండీ లేఖ


(ఉద్యోగులు న్యూస్)


విద్యుత్తు ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఎలాంటి సమ్మెలు, నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని  ట్రాన్స్ కో, జెన్ కో యాజమాన్యం వారికి విన్నవించింది. ఈ మేరకు ట్రాన్సుకో  సీఎండీ  శ్రీధర్ విద్యుత్తు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితికి శుక్రవారం లేఖ రాశారు. దీపావళి  పండుగతో పాటు కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  ఆందోళనను వాయిదా వేసుకోవాలని కోరిన ఏపీ ట్రాన్స్ కో సీఎండీ. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు-ప్రభుత్వం మధ్య చర్చల విషయాన్ని తన లేఖలో ప్రస్తావించిన సీఎండీ ఉద్యోగ సంఘాలను మరో మారు చర్చలకు ఆహ్వానించారు. వారి డిమాండ్లపై మరో మారు మాట్లాడదామని పేర్కొన్నారు.