Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

పెండింగు జీతాలు  ఈ  ఏడాదిలోనే చెల్లింపు  విద్యుత్తు ఉద్యోగుల జేఏసీకి అధికారుల హామీ


* ఇతర సమస్యల పరిష్కారానికి ఒప్పందాలు 
* మినిట్స్ లో నమోదు...

(ఉద్యోగులు న్యూస్)
కరోనా కారణంగా విద్యుత్తు ఉద్యోగులకు వాయిదా వేసిన పెండింగు జీతాలను  ఈ  ఏడాదిలోనే చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు.  కరవు భత్యానికి సంబంధించి ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగానే వ్యవహరిస్తామని  పేర్కొన్నారు. విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నాయకులు  పి.చంద్రశేఖర్, ఎం. వేదవ్యాస రావు, బి.సాయికృష్ణలతో  ట్రాన్స్ కో సీఎండీ శ్రీకాంత్, సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్థన్ రెడ్డి, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కె.శ్రీధర్ రెడ్డి, ఈపీడీసీఎల్ డైరక్టర్ కె.రాజబాపయ్య తదితరులతో మంగళవారం  చర్చలు జరిగాయి. విద్యుత్తుశాఖ మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో  కుదిరిన ఒప్పంద అంశాలను మినిట్స్  రూపంలో జారీ చేశారు. 2022 మార్చి 31 వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న  2018 పే రివిజన్ కమిషన్ ను గౌరవిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇతర అంశాలు ఇలా  ఉన్నాయి.
*  పెన్షన్ స్కీంకు సంబందించి పాత లయబిలిటీలతో సంబంధం లేకుండా 30 రోజుల్లో ఒక విధానం  రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తారు. దీనిపైప్రభుత్వం ఏ నిర్ణయం వెలువరిస్తే అది అమలు చేసేందుకు అధికారులు అంగీకరించారు.
* వైద్య బీమా, ప్రమాద బీమా, కారుణ్య నియామకాలు, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి  తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్ట, తమిళనాడు, గుజరాత్ లలో ఉన్న విధానాలను అధ్యయనం చేసి 60 రోజుల్లో  ఏపీ ట్రాన్స్ కో జేఎండీ,  ఈపీడీసీఎల్  సీఎండీలు  నివేదిక ఇవ్వనున్నారు.
* కరోనా కారణంగా తలెత్తిన వైద్య పరిస్థితుల నేపథ్యంలో రూ.50 లక్షల ఆరోగ్య బీమా వసతిని జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ నుంచి అ ధికారులు కమిటీగా ఏర్పడి ఎలాంటి వైద్య పథకం కావాలో 30 రోజుల్లోగా  నగదు రహిత వైద్యానికి సంబంధించిన స్కీం ఎలా ఉండాలో  సిఫార్సు చేయాల్సి ఉంటుంది. 
కోవిడ్ సోకి వైద్యం చేయించుకున్న వారి ఖర్చులు చెల్లించే విషయంలో సీజీహెచ్ఎస్ ప్యాకేజీలతో సంబంధం లేకుండా వైద్య ఖర్చులు చెల్లించేందుకు హామీ.
*  ఏపీ జెన్ కో యూనిట్లు అన్నీ పని చేసేలా చూస్తారు. ప్రస్తుత విద్యుత్తు ఒప్పందాల ప్రకారం విద్యుత్తు కొనుగోలు సాగుతుంది.
*  2020 విద్యుత్తు సవరణ బిల్లు వల్ల ప్రయివేటీకరణకు దారి తీస్తుందని జేఏసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణ వేగంగా జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో మినిట్స్ లో పేర్కొన్నారు. ప్రయివేటీకరణ చేయాలని రాష్ర్ట ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదని కూడా పేర్కొన్నారు.
*  కారుణ్య నియామకాలకు సంబంధించి తలెత్తిన ఇబ్బందులు పరిష్కరించేందుకు ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులన్నింటినీ నిలుపుదల చేసి అన్ని సంఘాలతో చర్చించేందుకు అధికారుల అంగీకారం.
*   పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలన్నీ  పూర్తి చేసేందుకు అంగీకారం. వయసు దాటిన వారి విషయంలో ఈ ఒక్క పర్యాయానికి  నిబంధనల సవరణకు అనుమతి.