విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితితో  ఒప్పందాలు అమలు  చేయాలి 

(ఉద్యోగులు న్యూస్)
 

క్రాంట్రాక్టు కార్మికులను విద్యుత్  సంస్థలో విలీనం చెయ్యాలని  పార్వతీపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం-327 సర్వ సభ్య సమావేశం డిమాండ్ చేసింది. పిల్లిగూడ, గుమ్మలక్ష్మీపురంలో  ఆదివారం  సమావేశం జరిగినది. సంఘ  రాష్ట్ర సెక్రటరీ జనరల్ బలగ  సాయికృష్ణ,,ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపి ట్రాన్స్ కో యాజమన్యం ,  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.  క్రాంట్రాక్టు కార్మికులకు విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు  చెల్లించాలని,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితితో జరిపిన ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని కోరారు. 1999 ఫిబ్రవరి 1 నుంచి   2004 ఆగస్టు 31 వరకు గల విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వ  ఉద్యోగులతో సమానంగా పెన్షన్ కల్పించాలన్నారు.  విద్యుత్ ఉద్యోగులు కార్మికులు తమ సంఘ సారధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

 

రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి. సురేష్ పట్నాయక్  (ఎల్ఐ,  గరుగుబిల్లి),   జియ్యమ్మవ లస కంపనీ జాయింట్ సెక్రటరీ సీహెచ్. పెంటయ్య,  సెక్రటరిగా  మోహన రావు,   రీజనల్ అసిస్టెంట్ సెక్రటరీ ఎం కిషోర్ , రీజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.  కేశవ,  డివిజనల్. అడిషనల్ సెక్రటరీగా .ఆమిటి వెంకట రమణ ,   డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ గా టి. సతీష్ , డివిజనల్ జాయింట్ సెక్రటరీ జి .గోపాలం,   డివిజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. విజయకుమార్ ,    కోశాధికారిగా  పూడి సింహచలం ఎన్నుకున్నారు.  సమావేశంలో ,డివిజనల్ కార్యదర్శి బొత్స అచ్చు తరావు,    ఫ్రాంచైజీ ఫీడర్ అధ్యక్షుడుచంద్రశేఖర్ ,  కార్యదర్శి  కె.శ్రీను, .,బొబ్బిలి డివిజన్ అధ్యక్ష కార్య దర్శులు తేజేశ్వరరావు,  శంకర రావు కంపనీ ఆర్గనైగజింగ్ కార్యదర్శి సత్యనారాయణ ,రీజినల్ కోశాధికరిి ,. సతీష్, వాసు, .చిన్ని కృష్ణ,. పెంటయ్య, బి.కిషోర్, సతీష్, ప్రసాదు,  రామారావు, విజయకుమార్, లవుడు, .జగదీష్ కుమార్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.