Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

డివిజనల్ అభివృద్ధి అధికారులకు కనీసం 10 ఏళ్ల సీనియారిటీ

*ఫ్రభుత్వ ఆదేశాలు

*8సవరణ ఉత్తర్వులు

*8 మందికి నియామక ఆదేశాలు

(ఉద్యోగులు న్యూస్)

 

* కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఎంపిడిఓలతో డిఎల్‌డిఓ పోస్టులను నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు విశాఖ, గుంటూరు జిల్లాల్లో కొన్ని డివిజన్లకు డీఎల్ డీవో లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఎంపీడీవో లను, గుంటూరు జిల్లాలో నలుగురు ఎంపీడీవో లను డీఎల్ డీవో లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.   ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

* విశాఖపట్నం  డీఎల్ డీవో గా దేవరాపల్లి మండలం ఎంపీడీవో సీ హెచ్ సుబ్బ లక్ష్మి నియామకం

* అనకాపల్లి డీఎల్ డీవో గా వి. మాడుగుల మండలం ఎంపీడీవో  ఎం. పోలినాయుడు నియామకం

* పాడేరు డీఎల్ డీవో గా  పద్మనాభం మండల ఎంపీడీవో  జి.వి. చిట్టి రాజు .

* నర్సీపట్నం డీఎల్ డీవో గా ఎలమంచిలి మండలం ఎంపీడీవో బీ వీ సత్యనారాయణ

* గుంటూరు డివిజన్ డీఎల్ డీ వోగా  పెదకూరపాడు మండలం ఎంపీడీవో ఎస్ రాజేష్

* తెనాలి డివిజన్ డీఎల్ డీవో గా మంగళగిరి మండలం ఎంపీడీవో ఎ. సుధాకర్ 

*  నరసారావు పేట డీఎల్ డీవోగా  నాదెండ్ల మండల ఎంపీడీవో ఎం. వెంకటరెడ్డి

* గురజాల డీఎల్ డీవో గా రొంపిచర్ల మండలం ఎంపీడీవో బి. అర్జునరావు