Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

లక్షకు పైగా ఉద్యోగులం... లక్షణమైన విధానాలు కోరుతున్నాం!

(ఉద్యోగులు న్యూస్)

ఆంధ్రప్రదేశ్ లో  కొత్తగా ఏర్పాటైన వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే వ్యవస్థాగతమవుతోంది. ప్రభుత్వం కొత్తగా లక్షకు మంది కి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసే అవకాశం కల్పించింది. కొత్త ఉద్యోగాల కల్పనతో  లక్ష మందికి పైగా యువతీ, యువకులు ఉపాధితో కొత్త ఉత్సాహంతో ఉన్నారు.  సాధారణంగానే ఉద్యోగంలో చేరిన  తర్వాత ప్రాథమికగంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పైగా సచివాలయ వ్యవస్థ కొత్తగా రూపుదిద్దుకుంటోంది.  ఆ కారణంగా మరిన్ని  మార్పులు అవసరమవుతాయి. ఇందులో భాగంగా  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఏర్పాటయింది. వారు అనేక అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. కొత్త వ్యవస్థలో  ఉద్యోగులకు కొన్ని మార్పులు కావాలని అడుగుతున్నారు.

* గ్రామ ,వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికీ ప్రొబెషినరీ పీరియడ్ లోనే పే స్కేల్ వర్తింపచేయాలి . లేదా కనీసం రూ. 25,000  వేతనం అందేలా చూడాలి.

*  ఇప్పటికే ఈ వ్యవస్థలో ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

* ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇతర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగం పొందిన వారిని వేతన రికవరీ లేకుండా రిలీవ్ చేయాలి.

* అంతర్ జిల్లా, మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇవ్వాలి.

*  ఉద్యోగులందరికీ సర్వీసు రిజిష్టర్లు ఏర్పాటు చేయాలి.

*  ఈ వ్యవస్థలో ఒక శాఖ ఉద్యోగులపై ఇతర శాఖల అజమాయిషీ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏ శాఖ ఉద్యోగులు ఆ శాఖ ఉన్నతాధికారుల పరిధిలో పని చేసేలా చూడాలి.

*  పారిశుధ్ధ్య, పర్యావరణ కార్యదర్శులకు ఆదివారం సెలవు లేకుండా పోయింది. విధి నిర్వహణ సమయాలు, వీక్లీ ఆఫ్ కోసం తగు ఆదేశాలు ఇవ్వాలి.

* నెలకు అయిదు , ఆరుసార్లు మండల కేంద్రాలకు వెళ్లవలసిన వారికి టీఏ, డీఏ వెసులుబాటు కల్పించాలి.

*  ప్రతీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆరోగ్య బీమా వర్తింపచేయాలి. కరోనాకి సంబంధించి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వర్తింపచేయాలి.

* క్షేత్ర స్థాయి ఉద్యోగులకు బయో మెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలి.

*   గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికి రెగ్యులర్ ప్రమోషన్ ఛానల్  కల్పించాలి.

*  పదోన్నతి తో గ్రామ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి ఎ.పి. మినిస్టీరియల్, ఎ.పి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రొబెషనరీ పీరీడ్ ఏడాదిగా నిర్ణయించాలి.

*  ప్రతీ గ్రామ ,వార్డు సచివాలయానికి కనీసం మరో రెండు కంప్యూటర్లు అదనంగా అవసరం.