Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఆర్టీసీలో స‌ర్వీస్ నిబంధ‌నలు అమలుచేయాలి

* ఖాళీ పోస్టులను వెంట‌నే భర్తీ చేయాలి

* అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ తొలి సమావేశం తీర్మానం

 

ఆర్టీసీలో ఉద్యోగులకు సర్వీసు రూల్సు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ (ఎ.పి.పి.టి.డి.) అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు డిమాండ్ చేశారు. సిబ్బందికి రావాల్సిన అలవెన్సులు మంజూరు చేయాలని కోరారు.  ఖాళీ పోస్టులను వెంట‌నే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.   ఒంగోలులో సోమవారం  అసోసియేషన్ మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో ఆయన మాట్లాడారు.  జోనల్ చైర్మన్ కోలా ల‌క్ష్మీపతి సమావేశానికి అధ్యక్షత వహించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గడియం వెంకటరామిరెడ్డిఛైర్మన్ బత్తుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రగిరి ప్రసాద్ తదితరులు మాట్లాడారు. కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది.

అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి నూతన కమిటీ ఇలా ఉంది....

గడియం వెంకట్రామిరెడ్డి  (గౌరవ అధ్యక్షులు), బత్తుల వెంకటేశ్వర్లు (ఛైర్మన్), వినుకొండ రాజారావు (చైర్మన్), కోలా లక్షీపతి (నెల్లూరు జోనల్ ఛైర్మన్, రాష్ట్ర సలహాదారులు) ,చంద్రగిరి ప్రసాద్ (రాష్ట్ర అధ్యక్షులు), షేక్ మహమ్మద్ రఫీ (రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) ,జక్కా సాయిబాబా (రాష్ట్ర ప్రధానకార్యదర్శి) , బి.సురేష్ నాయక్ (రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి).ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ (చిత్తూరు రీజియన్ గౌరవాధ్యక్షులు). కుర్మా ప్రసాద్‌బాబు (రాష్ట్ర డైరెక్టర్ ఆర్గనైజేషన్) రమేష్ కాకర్ల (కడప జిల్లా జోనల్ చైర్మన్, రాష్ట్ర గౌరవ సలహాదారు).