Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

బదిలీ చేస్తే వెళ్లిపోతానన్న  విద్యాశాఖ ఉన్నతాధికారి?

*   ఒత్తిడిలోనే అలా వ్యవహరించినట్లు వెల్లడి
*   ఇక పై అలా ఉండబోననీ  హామీ
*    ఉపాధ్యాయ సంఘ చర్చల్లో ఇదే కీలకాంశమా?
*   అవునంటున్న ఉపాధ్యాయ నేతలు

( ఉద్యోగులు న్యూస్)

ఉపాధ్యాయ సంఘాల విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖ ఉన్నతాధికారి  ఇటీవల వ్యవహరిస్తున్న తీరు కీలక చర్చనీయాంశమయింది. బదిలీలు, రేషన్ లైజేషన్ ప్రక్రియ కు సంబంధించిన జీవోలు వెలువడటానికి, వెలువడ్డ తర్వాత కూడా సంఘాలకు- ఉన్నతాధికారులకు మధ్య  భిన్నాభిప్రాయాలతో పరిస్థితులు ముదిరి పాకానపడ్డాయి. ఫ్యాప్టో రిలే దీక్షల సమయంలో కొందరు  ఉపాధ్యాయ నాయకులను సస్పెండ్ చేస్తానని కూడా ఒక ఉన్నతాధికారి హెచ్చరించిన విషయమూ ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశమయింది. ఆ తర్వాత బదిలీలు, రేషనలైజేషన్ విషయంలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయమూ పరిగణనలోకి తీసుకోకుండా  ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. రేషనలైజేషన్ లో రోజుకో తరహా ఉత్తర్వులు రావడంతో ఉపాధ్యాయులు గందరగోళంలో పడ్డారు.ఫ్యాప్టో  21న పికెటింగుకు  నోటీసు ఇచ్చినా పరిస్థితుల్లో   మార్పు రాలేదు. మరో వైపు జాక్టో నాయకులు సైతం  ప్రభుత్వ సలహాదారు  సజ్జల  రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు.  పరిస్థితి ముదిరి పాకాన పడటంతో  ఏడుగురు ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. నేరుగా విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ ను కలిశారు. జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన అవసరాన్ని వివరించారు. ఫ్యాప్టోను చర్చలకు పిలిచి మాట్లాడాలని కోరారు.
2 గంటల పాటు అధికారి వ్యవహారశైలి పైనే చర్చ....
బుధవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలో జరిగిన చర్చల్లో  విద్యా మంత్రి , విద్యాశాఖ అధికారులు, ఫ్యాప్టో నాయకుల మధ్య చర్చలు  జరిగాయి. నిజానికి ఈ సమావేశంలో బదిలీలు, రేషనలైజేషన్ నిబంధనల్లో మార్పు అంశం కన్నా ఉపాధ్యాయ సంఘాలు, సంఘ నేతలతో ఒక అధికారి వ్యవహరించిన తీరే తొలుత ప్రధాన చర్చనీయాంశమయినట్లు  తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు దీనిపై సుదీర్ఘ చర్చ సాగింది.
ఇన్నాళ్లుగా ఏ అధికారి ఉపాధ్యాయ సంఘాలతో ఇలా వ్యవహరించలేదని సందర్భాను సారంగా ఎప్పుడు ఏం జరిగాయో విద్యా మంత్రి ముందు ఉంచినట్లు సమాచారం.  అయితే  విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా తన వాదన వినిపించినట్లు తెలిసింది. ఒత్తిడి  పరిస్థితులు, తనకు ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలోనే కాస్త అలా వ్యవహరించానే తప్ప వేరే  ఉద్దేశాలు ఏమీ లేవని చెప్పినట్లు సమాచారం. తనను బదిలీ చేసేస్తే వెళ్లిపోవడానికీ సిద్ధమని ఆయన ఒకానొక దశలో చెప్పినట్లు సమాచారం. ఇక ముందు అలా ఉండబోనని కూడా ఆయన హామీ ఇచ్చారని తెలిసింది.  ఈ విషయంలో సర్దుబాటు జరిగిన తర్వాతే అసలు బదిలీ సమస్యలు, రేషనలైజేషన్ సమస్యలపై చర్చ సాగినట్లు సమాచారం.