ఇక ఉపాధ్యాయులకు ఈ ఏడాది 2.5 సీఎల్ లే!

*విద్యాశాఖ ఉత్తర్వుల్లో సుస్పష్టం

*స్పెషల్ లీవు, ఓ హెచ్ లు  లేవు

( ఉద్యోగులు న్యూస్)

ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులంతా నవంబరు, డిసెంబర్ నెలల్లో ఇక 2.5  క్యాజువల్ లీవులు మాత్రమే వినియోగించుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ డైరక్టర్ వాడ్రేవు చినవీరభద్రడు  శుక్రవారం స్పష్టత ఇచ్చారు. కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరంలో   పాఠశాలలు సరిగా తెరుచుకోలేదు. పైగా చాలా కాలం పాటు   రోజు విడిచి రోజు హాజరయ్యేలా ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాది మిగిలిన  ఉన్న రెండు నెలల్లో క్యాజువల్ లీవు ఎలా వాడుకోవాలనే విషయంలో సందేహాలు తలెత్తాయి. 2.5 లీవులు మాత్రమే వాడుకోవాలని గతంలో చెప్పారు. నెలకు 2.5 లీవులా, లేక  రెండు నెలలకు కలిపా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై రాష్ర్టంలోని  రీజినల్ జాయింటు డైరక్లర్లందరూ  స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  మహిళా టీచర్లకు ఏడాదికి ఇచ్చే 5 స స్పెషల్ సీ ఎల్ లు కూడా వర్తించబోవు.  ఆప్షనల్ హాలిడేలు కూడా వర్తించబోవని విద్యాశాఖ డైరక్టర్ స్పష్టం చేశారు.

టీచర్ల సెలవులపై సవరణ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులు నవంబరు, డిసెంబర్ నెలల్లో వినియోగించుకోదగ్గ ఉత్తర్వులు మళ్లీ సవరించారు. ఈ మేరకు సవరణ ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వెలువడ్డాయి. పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఈ ఉత్తర్వులు ఇచ్చారు. క్యాజువల్ లీవు ఇక ఈ రెండు నెలల కాలానికి 2.5. రోజులే వాడుకోవాలి. స్పెషల్ లీవు ఒక రోజు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. మహిళలకు ఇచ్చే స్పెషల్ లీవు కూడా ఇక ఒక రోజు వినియోగానికే ఆస్కారం కల్పించారు. ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పెషల్ లీవుకు కు అవకాశం లేదన్న ఉత్తర్వులను మార్పు చేశారు. మిగిలినదంతా యధాతథంగా ఉంది. మిగిలిన మెటర్నటీ లీవు, పెటర్నటీ లీవు వంటివి మామూలుగానే వినియోగించుకోవచ్చు