ఉపాధ్యాయులకు కోవిడ్  ప్రత్యేక సెలవు లేదు

*సిక్ లీవు పెట్టుకోవాల్సిందే
*విద్యాశాఖ డైరక్టర్ సుస్పష్టం

( ఉద్యోగులు న్యూస్)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రత్యేక సెలవు వర్తించబోదు. వారు కరోనాకు చికిత్స తీసుకున్నా , క్వారంటైన్ లో ఉన్నా వారికి ఉన్న సిక్ లీవు వినియోగించుకోవాల్సిందే. ఈ విషయంపై శుక్రవారం విద్యాశాఖ డైరక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు స్పష్టత ఇచ్చారు.  కరోనా సోకిన ఉపాధ్యాయులకు 28 రోజుల కాలానికి ప్రత్యేక  సెలవు మంజూరు చేయాలని గతం నుంచి డిమాండ్  చేస్తూ వస్తున్నారు. అయితే అలాంటి ప్రత్యేక సెలవుకు ఆస్కారం లేదని తేల్చి చెప్పేశారు.  రాష్ర్టంలో వేల సంఖ్యలో టీచర్లు కరోనా బారిన పడ్డారు. కొందరు మరణించారు. ఇప్పటికీ కరోనా బారిన పడుతున్న  టీచర్లు ఉన్నారు.