పిఆర్టియు సేవలు అభినందనీయం
(ఉద్యోగులు న్యూస్)
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ , సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు కాకర్ల వెంకట రామిరెడ్డి కృష్ణా జిల్లా పిఆర్టియు కాలెండర్ ను ఆవిష్కరించారు. పిఆర్టియు స్టేట్ ఎకడమిక్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కోసూరి రాజశేఖర్. పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. గిరి ప్రసాద్ రెడ్డి, మల్లు శ్రీధర్ రెడ్డి మరియు కృష్ణా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగారావు, కొనకళ్ల రమేష్ బాబు మరియు పీఆర్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరపల్లి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ది బోయిన శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి కాకర్ల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలో పిఆర్టియు కృష్ణా జిల్లా శాఖ ముందుందని ఇదే స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా పనిచేసి పి ఆర్ టి యు ను బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు.