పోరాట యోధుడు బాలకృష్ణమ్మ

(ఉద్యోగులు న్యూస్)


ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడు,  మాజీ ఎమ్మెల్సీ  మార్పు బాలకృష్ణమ్మ 8వ సంస్మరణ సభ రాజమహేంద్రవరం నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో శుక్రవారం  జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ  అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి బాలకృష్ణమ్మ ఎనలేని  కృషి చేశారని, సమాజంలో ఉపాధ్యాయుల స్థాయిని సామాజికంగా, ఆర్ధికంగా పెంచడానికి ఎన్నో పోరాటాలు చేసారన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిలర్ వైఆర్కే  ప్రసాద్  మాట్లాడుతూ బాలకృష్ణమ్మ తుదిశ్వాస వరకు ఉపాధ్యాయుల అభ్యున్నతికి పాటు పడ్డారన్నారు.


 అధికారులను పరుగులెట్టించి సమస్యలను సాధించగలిగారని అన్నారు. సంఘంలో ఉపాధ్యాయుల ఉన్నత స్థానానికి కారణం ఆయన త్యాగ ఫలితమే అని రాష్ట్ర మాజీ కార్యదర్శి రామలింగ శాస్త్రి గారు అన్నారు.సీనియర్ కార్యకర్త ముంగండి సత్యనారాయణ,
నగర శాఖ ప్రధాన కార్యదర్శి ఉదయ బ్రహ్మం నగర శాఖ అధ్యక్షులు డేవిడ్, మాజీ అధ్యక్షులు శాస్త్రి, సీనియర్ కార్యకర్తలు  ఆంజనేయులు గారు,మార్కండేయులు , నగర శాఖ అదనపు కార్యదర్శి శంకర్ గారు,నగర శాఖ మహిళా కార్యదర్శులు శ్రీమతి ఉషాకాంతగారు,పద్మజగారు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.