ఎమ్మెల్సీ అభ్యర్థి కల్పలతను మండలికి పంపుతాం
* ఫోర్టో నేతలు
(ఉద్యోగులు న్యూస్)
కృష్ణ, గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి కల్పలత కి ఫోరం ఆఫ్ రిజిస్టర్ టీచర్ ఆర్గనైజేషన్ (ఫోర్టో) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఫోర్టో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామల సింహాచలం, ఫోర్టో గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ముఖ్య సలహాదారులు గాండ్లపర్తి శివానందరెడ్డి, మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్, సావిత్రిబాయి పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి విజయలక్ష్మి ,కో చైర్మన్ లు ఏపీ రెడ్డి, ఎం గిరిజాపతి, కే శివ శంకర్ రెడ్డి , ఎస్ శ్రీనివాస రావు, కరీముల్లా రావు, శ్రీ హరి కోట యోహాను, లెక్కల జమాల్ రెడ్డి, మాగంటి శ్రీనివాసరావు,పి. దాసు, ఎల్ దుర్గారావు, సుబ్బారెడ్డి, శోభామణి తదితర 18 సంఘాల నాయకులు మద్దతు విషయాన్ని ప్రకటించారు. శుక్రవారం తాడేపల్లిలోని గెలాక్సీ అపార్ట్మెంట్ లో జరిగిన గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఈ మేరకు ఫోర్టో తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్ధతు లేఖను అందజేశారు. టీచర్ల ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొదటిసారిగా టీచర్ ఎమ్మెల్సీగా మహిళా అభ్యర్థిని పోటీ చేయడాన్ని ఫోర్టో స్వాగతిస్తోందని, విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కల్పలత హామీ ఇచరన్నారు. టీచర్ ఎమ్మెల్సీగా కల్పలత విజయం సాధించేందుకు ఫోర్టో సభ్య సంఘాలు ఐక్యంగా కృషి చేస్తాయని ఫోర్టో నాయకులు పేర్కొన్నారు.