Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

సీపీఎస్, పాత పెన్షన్ విధానంపై  ముఖ్యమంత్రి దిశానిర్దేశం

*   ఆర్టీసీ ఉద్యోగులను కలిపి పాత పెన్షన్ లెక్కలు చెప్పండి
*   పాత పెన్షన్ విధానంలో ఎంత, సీపీఎస్ కు ఎంత?
*    పట్టిక రూపంలో ఇవ్వండి
*    అధ్యయన వివరాలు  తెలియజేసిన ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి

(ఉద్యోగులు న్యూస్)


ప్రస్తుతం  కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో ఉన్న ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులను కూడా కలిపి పాత పెన్షన్ విధానం అమలు చేస్తే ఎంత నిధుల భారం పడుతుందో లెక్కించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయంలో  గురువారం సీపీఎస్ పై జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి  ఎంటీ కృష్ణబాబు, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసులు) కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్‌ ;గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, పురపాలక పరిపాలన శాఖ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు, వివిధ శాఖల అధికారులు  ఈ సమావేశానికి హాజరయ్యారు.
    కాంట్రిబ్యూటరీ పింఛను పథకానికి (సీపీఎస్‌) సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్‌ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్‌ కమిటీ నివేదికను కూడా  పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.


    రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని, వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 కాగా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రికి  చెప్పారు. వారికి ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు.
వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న  ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్, ప్రభుత్వంలో విలీనం  చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక (టేబుల్‌) సిద్దం చేయాలని ఆదేశించారు. వారిని కూడా కలిపిన తర్వాత ఏ పథకం కింద ఎంత ఖర్చవుతుందో లెక్కలు తీయాలని సూచించారు. ఇందుకు సంబంధించి కొన్ని విషయాలపై ఉద్యోగ సంఘాల నాయకులతోను చర్చించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.