Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

సచివాలయాల ఇంజినీరింగు అసిస్టెంట్లకు పరిశ్రమల విధులూ

*పరిశ్రమలశాఖలకు ప్రభుత్వం అనుమతి

( ఉద్యోగులు న్యూస్)
రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా గ్రామ వార్డు సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లను వినియోగించుకోవాలని ప్రభుత్వ నిర్ణయం  తీసుకుంది. ఈ మేరకు పరిశ్రమలశాఖకు అనుమతి లభించింది. రాష్ర్టం అంతటా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర సర్వేను పరిశ్రమల శాఖ చేపడుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజినీరింగు అసిస్టెంట్లను ఈ విధులకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీరితో పాటు సదుపాయాల కల్పన సహాయకులను కూడా వినియోగించుకుంటారు. పరిశ్రమల్లోని వివిధ అంశాల నమోదు ప్రక్రియలో  వీరి సేవలు వినియోగించుకోవచ్చని సూచించింది. పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం, రెవెన్యూ , ఉపాధి కల్పన తదితర అంశాలను మొబైల్ యాప్ లో నమోదు చేయాల్సిందిగా గ్రామ వార్డు సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఆదేశాలు  జారీ అయ్యాయి. దీంతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాలపై కూడా అవగాహన కల్పించేలా సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని  ప్రభుత్వం నిర్ణయించింది.