Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ఉద్యోగ సంఘాల  అధికారిక గుర్తింపునకు  ఇక ఎన్నికలు!


*   ఆర్టీసీ తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వ  యోచన
*    ఇప్పటికే ఉద్యోగ సంఘాల ముందుకు ప్రతిపాదన
*    ఇందుకు మద్దతుగా సంఘాల డిమాండ్లు తెరపైకి

 (ఉద్యోగులు న్యూస్)


ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఇతర అనేకశాఖలకు సంబంధించిన గుర్తింపు సంఘాలు అనేకం ఉన్నా  అధికారికంగా ఇక ఒకటే గుర్తింపు సంఘం ఉండబోతోందా? అన్ని సంఘాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్దుష్ట సమయానికి ఎన్నికలు నిర్వహించి ఉద్యోగులు ఎవరికి గుర్తింపు ఇస్తారో వారికే  ప్రభుత్వం పెద్ద పీట వేయనుందా? తాజా పరిణామాలు గమనిస్తోంటే ఇలాంటి ప్రతిపాదనపై మళ్లీ కొత్తగా చర్చ మొదలయింది. రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థలో ఇంతకుముందు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించిన తరహాలోనే  రాష్ర్టంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతరశాఖలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కూడా ఇలాగే ప్రభుత్వమే అధికారికంగా ఎన్నికలు నిర్వహించే యోచన ఒకటి తెరపైకి వచ్చింది. వివిధ గుర్తింపు సంఘాల మధ్య పోటీ వాతావరణం, అనేక డిమాండ్లు, అందరూ ఉద్యోగుల ప్రతినిధులుగానే చర్చలు జరుపుతున్న నేపథ్యంలో  ఉద్యోగుల్లో నిజంగా ఎవరికి మద్దతు ఉందో ఎన్నికల ద్వారా తేల్చనున్నారు. ఈ మధ్య ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  నాలుగు  సంఘాల నాయకులను ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిచి డీఏలు, పెండింగు జీతాలు తదితర అంశాలపై చర్చించిన క్రమంలోనే ఈ అంశమూ తెరపైకి తీసుకువచ్చారని తెలిసింది. వారిలో కొందరి ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. ఇందుకు కొన్ని సంఘాల నేతలు సైతం సుముఖంగా స్పందించినట్లు తెలిసింది.
 ప్రతి రెండేళ్లకు లేదా, మూడు ఏళ్లకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో   ఏ  సంఘం గెలిస్తే వారే అధికారిక సంఘంగా చలమాణీ అవుతారు.  తొలుత జిల్లాల వారీగా ఎన్నికలు జరిపి ఆనక రాష్ర్ట స్థాయి గుర్తింపు సంఘాన్ని నిర్ణయిస్తారు.  మొదట ఇందుకు సానుకూలత కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే  ఆ తర్వాత  విధివిధానాలు అధికారికంగా ఖరారవుతాయి.
 ఈ మధ్య రెవెన్యూ కొత్త సంఘం ఏర్పాటు నేపథ్యంలో రెండు సంఘాల మధ్య ఒకరిపై మరొకరి ఆరోపణలు సాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక సంఘం వారు ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించి అధికారిక  సంఘాన్ని గుర్తించాలన్న డిమాండ్ ను తెరపైకి  తీసుకువచ్చారు.  వెంటనే మరో సంఘం దీనికి మద్దతు పలికింది.  ఈ అన్ని డిమాండ్లు మద్దతు వెనుక ప్రభుత్వ ప్రతినిధుల ఆలోచన మేరకే ఇదంతా సాగుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇది అనుకున్నంత సులభంగా పూర్తయ్యే అవకాశం లేదని, ఇంతకుముందు ఈ ప్రతిపాదన ఉందని చెబుతున్న ఉద్యోగ సంఘాల నాయకులూ  ఉన్నారు.