కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుపై సమగ్ర ప్రణాళిక అవసరం


*    ఉద్యోగ సంఘాలతో చర్చించాలి
*    బొప్పరాజు వెంకటేశ్వర్లు, వై వీ రావు డిమాండ్


(ఉద్యోగులు న్యూస్)


ఆంధ్రప్రదేశ్ లో 25 లేదా 26 కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై సమగ్ర ప్రణాళిక ప్రకటించాలని  ఏపీ అమరావతి జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వై వీ రావులు డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల  ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూ కొత్త జిల్లాల ఏర్పాటులో ఉద్యోగులకు అనేక ఇబ్బందులుఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో  చర్చించి సందేహాలు నివృత్తి చేయాలని కోరారు.  వీరి డిమాండ్లు ఇలా ఉన్నాయి....
*  జిల్లాల ఏర్పాటులో కేడర్ విభజనపై ఉద్యోగులకు భరోసా ఇవ్వాలి.
*   జిల్లాల ఏర్పాటులో లోకల్ /నాన్ లోకల్ ను  పరిగణించేటప్పుడు  ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలి.
*   కొత్త జిల్లా కేంద్రాల్లో  కార్యాలయాల ఏర్పాటు, మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
*   కొత్ జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు రెసిడెన్షియల్ సౌకర్యం కల్పించాలి.
*   కొత్త జిల్లాల్లో కూడా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల కొనసాగింపు ఉంటుందా లేదా అన్నది స్పష్టం చేయాలి.
*  జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్  వంటి  కార్యాలయాలలో  అన్ని సెక్షన్లు కొనసాగిస్తున్నారో లేదో అన్న సందేహం తీర్చాలి.