Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

మిగులు డ్రైవర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలి
 

*   ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ల  డిమాండ్
*   డ్రైవర్ల సంఘం నేతలతో కలిసి  పీయూష్ కుమార్ తో భేటీ


(ఉద్యోగులు న్యూస్)


ఆంధ్రప్రదేశ్ లో   ప్రస్తుతం వివిధ శాఖల్లో పని చేస్తున్న  డ్రైవర్లలో అర్హులై న వారిని జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలని, మిగిలిన వారిలో వారి ఆమోదం తీసుకుని అటెండర్లుగా, నాలుగో తరగతి ఉద్యోగులుగా పునర్ నిర్వచించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. వాణిజ్య పన్నులశాఖలో డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఈ సంఘం నేతలు విజయవాడలో గురువారం వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ పీయూష్ కుమార్ ను కలిసి మాట్లాడారు.  సుమారు 26 మంది  మిగులు  డ్రైవర్లు  ఉన్నారని వారి ని నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించవద్దని  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరింది. నాలుగో తరగతి  ఉద్యోగులుగా నియమించకుండా వేతన రక్షణ కల్పిస్తూ అదే శాఖలో ఉంచుతూ వివిధ క్యాడర్లలో వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు.  ఇందుకు పీయూష్ కుమార్ హామీ ఇచ్చి  తగిన ఫైలు సిద్ధం చేయాలని  అధికారులకు సూచించారు.