Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

నిబంధనలకు విరుద్ధంగా  ఉంటే  ప్రభుత్వ అద్దె వాహనాలకు బిల్లులు ఇవ్వద్దు...

*   ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్
*   ఖజానాశాఖ సంచాలకునితో భేటీ 


( ఉద్యోగులు న్యూస్)


ఆంధ్రప్రదేశ్ లో  ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏర్పాటు చేసిన ప్రయివేటు వాహనాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటికి బిల్లులు చెల్లించవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘమూ వాటికి అనుబంధంగా ఉన్న ఏపీ డ్రైవర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ర్ట ఖజానాశాఖ  సంచాలకులు హన్మంతరావును గురువారం నాయకులు కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వివిధ ప్రభుత్వశాఖల్లో అద్దె వాహనాలను ఒక దందాగా నడుపుతున్నారని, సరైన విధానంలో  ఏర్పాటు చేసిన అద్దె వాహనాలకే బిల్లలు చెల్లించాలని వీరు డిమాండ్ చేశారు. పెన్షనర్ల జీపీఎఫ్ బకాయిలు, ఇతర ప్రయోజనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు,  ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, డ్రైవర్ల సంఘం అధ్యక్షులు సంసాని శ్రీనివాస్, రెవెన్యూ జేఏసీ చైర్మన్ దివాకర్ తదితరులు ఖజానాశాఖ డైరక్టర్ ను కలిశారు.