గ్రేడ్ 5 కార్యదర్శులకు పూర్తి అధికారాలు ఇవ్వాలి

*డీపీవో కు ఉద్యోగ సంఘాల వినతి...


 (ఉద్యోగులు న్యూస్)  


గ్రామ సచివాలయాల్లో నియమితులైన గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు జీవో 159 ప్రకారం పూర్తి బాధ్యతలు, అధికారాలు ఇవ్వాలని  గ్రామ సచివాలయ సంఘం నాయకులు, ప్రభుత్వ  ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి పి.కొండయ్యను శుక్రవారం సాయంత్రం కలిసి  పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు.  ఈ  కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా,రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ , నగర శాఖ అధ్యక్షులు శివశంకర్ , గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్, గుంటూరు జిల్లా అధ్యక్షులు కంచర్ల నాగేశ్వరావు , నగర శాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు  నగర శాఖ ప్రధాన కార్యదర్శి  సందీప్ తదితరులు పాల్గొన్నారు.