విస్తరిస్తున్న రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్

*  ప్రకాశం జిల్లాశాఖ ఏర్పాటు

*   త్వరలో మరిన్ని జిల్లాలకు...

(ఉద్యోగులు న్యూస్)

రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటయిన ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. సంఘం నాయకులు రాష్ర్టంలోని అన్ని జిల్లాలు తిరుగుతూ జిల్లా శాఖలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కొత్త సంఘం తన శాఖను ఏర్పాటు చేసింది. ఒంగోలు ఆర్ డీ ఓ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఈ సంఘం సమావేశం ఏర్పాటయింది. రాష్ర్టంలో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇన్నాళ్లూ ఉన్న సంఘం నాయకులు పట్టించుకోపోవడం వల్లే ఇప్పడు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశామని దివాకర్ ప్రకటించారు. వీఆర్వో, వీఆర్ఏల సమస్యలతో తమకు సంబంధం లేదన్నట్లుగా వీరు వ్యవహరించారని విమర్శించారు. ఈ సమావేశంలో సిహెచ్. రవీంద్రబాబు, ఏలూరు నాయకుడు విద్యాసాగర్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు,డ్రైవర్ల సంఘ రాష్ర్ట కార్యదర్శి వై. నాగేశ్వరరావు, వీఆర్ ఏ సంఘం  రాష్ర్ట అధ్యక్షులు ఎన్. పెద్దన్న, వీఆర్వో సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె.ఆంజనేయకుమార్, కార్యదర్శి సురేష్ బాబు, తహశీల్దార్ల సంఘం రాష్ర్ట అధ్యక్షులు బి.రజనీకాంత్ తదితరులు మాట్లాడారు.

కొత్త కార్యవర్గం ఏర్పాటు ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ ప్రకాశం జిల్లా తాత్కాలిక కార్యవర్గం ఏర్పాటయింది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

పి.మధుసూదనరావు, తహశీల్దార్, అధ్యక్షులు వి.హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ఎన్.కోటేశ్వరరావు -కోశాధికారి ఈగా వెంకట్ రెడ్డి – జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కె.జానయ్య – ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ప్రేమయ్య – కల్చరల్ సెక్రటరీ పి.వివేకానందం-  జాయింట్ సెక్రటరీ