Sunday 17th January 2021
ముఖ్యాంశాలు
  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరి లో ప్రత్యక్ష కార్యాచరణే...23న ధర్నాచౌక్ లో ఆందోళన....ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల ఐక్యవేదిక నిర్ణయం  ***  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం....మంత్రివర్గ ఉప సంఘం బేటీ కొద్దిరోజుల్లో  ***  కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం.....సీఎం ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి  ***  పిఆర్సీ ఇతర సమస్యల కోసం దశల వారి ఆందోళన.....ఉపాధ్యాయులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ  ***  పండుగ కానుక గా పి‌ఆర్‌సి ప్రకటించాలి.....తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి  ***  ముఖ్యమంత్రి ముందుకు ఉద్యోగుల సమస్యలు......సీఎం ని కలిసిన చంద్రశేఖర్ రెడ్డి ఇతర నేతలు  ***  ఉద్యోగసంఘాలతో చర్చించాలి.....సీఎం కు ఏపీ అమరావతి జేఏసీ వినతి  ***  ఒక్క పదోన్నతి చాలు...వ్యవసాయ విస్తరణ అధికారుల డిమాండ్  ***

పీఆర్సీ పై  నేడు శాసనమండలిలో చర్చ...!

(ఉద్యోగులు న్యూస్) 


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో  మంగళవారం  ఉద్యోగుల సంక్షేమం- ప్రభుత్వ పాలసీ అనే అంశంపై చర్చ చేపట్టనుంది. శాసనమండలి 37వ సమావేశాలు శాసనసభ సమావేశాలతో పాటే ప్రారంభమయ్యాయి. రెండో రోజు మంగళవారం  ఎజెండా అంశాలు నిర్ణయించారు. ఇందులో  స్వల్ప కాల వ్యవధి చర్చల్లో భాగంగా ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా చేర్చారు. నివర్ తుపాను, కరోనా...ప్రభుత్వ చర్యలు అనే అంశాలతో పాటు మూడో అంశంగా ఉద్యోగుల సంక్షేమంపై చర్చించాలని నిర్ణయించారు.  ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న  ఎమ్మెల్సీలు  సభలో ఉన్నారు. పైగా రాష్ర్ట ఎన్ జీ వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసి ఆ తర్వాత  టీడీపీలో చేరి ఎం  ఎల్  సీ గా మారిన అశోక్ బాబు  ఉన్నారు. ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 11వ పీఆర్సీ అమలు, డీఏల ఫ్రీజింగు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సభ్యులు పేర్కొంటున్నారు. ఈ చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధాన ఇచ్చే అవకాశం ఉంది.