Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

పెండింగు జీతాల జి‌ఓ విడుదల

(ఉద్యోగులు న్యూస్) 
 

*మార్చి నెల  పెండింగు జీతాలు డిసెంబర్ లోనూ, ఏప్రిల్ నెల బకాయిలు  జనవరి లోనూ

కరోనా కారణంగా పెండింగులో ఉంచిన జీతాలు చెల్లించేందుకు రాష్ర్ట ఆర్ధిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లు, వివిధ క్యాడర్లలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా  మార్చి, ఏప్రిల్ నెలల్లో కోత విధించారు. ఉద్యోగులకు సగం మేర కోత విధించారు. నాలుగో తరగతి  ఉద్యోగులకు, ఇతరులకు వేర్వేరు మొత్తాల్లో కోత విధించారు. పెన్షనర్లకు మార్చి నెల పింఛను లో సగం కోత విధంచారు. ఈ పెండింగు  మొత్తాలను డి సెంబర్ , జనవరి నెలల్లో  రెండు విడతల్లో చెల్లించేందుకు ఉత్తర్వులు విడుదల చేసింది.మార్చి నెల  పెండింగు జీతాలు డిసెంబర్ లోనూ, ఏప్రిల్ నెల బకాయిలు  జనవరి లోనూ బిల్లులు తయారు చేయాలని డి‌డి‌ఓ లకు  ఉత్తర్వులు ఇచ్చింది.  మంత్రి మండలి సమావేశం లోనూ  వీటికి ఆమోదం తెలిపిన విషయం విదితమే.

ఎక్కువ మందిచదివినవి