Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

2,300 మంది వీఆర్ఏల ప్రమోషన్లకు సీఎం సానుకూలం

*వినతిపత్రం అధికారులకు ఎండార్స్...

 

(ఉద్యోగులు న్యూస్)

ఆంధ్రప్రదేశ్ లో 2,300 మంది వీఆర్ఏల ప్రమోషన్లకు ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారని  ఏపీ వీఆర్ఏల అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షులు ధారా రాజు, ప్రధాన కార్యదర్శి బుర్రి సుధాకర్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ గవర్నమెంటు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రికి వివరించగా ఆయన సానుకూలంగా  స్పందించడమే కాకుండా తమ వినతిపత్రం అధికారులకు  చర్యల నిమిత్తం ఎండార్స్ చేశారని పేర్కొన్నారు. జీవో 13 ద్వారా రాష్ర్టంలో 3,795 మంది వీఆర్ఏలకు  ఇప్పటికే ప్రమోషన్లు వచ్చాయి. మిగిలిన వారిలో అర్హత కలిగిన 2,300 మంది ప్రస్తుతం ఖాళీ ఉన్న వీఆర్వో పోస్టుల్లోకి ప్రమోషన్లు కోరుతున్నామని వారు తెలిపారు. ఆ తర్వాత వీఆర్వోలు పదవీవిరమణ చేయడం వల్ల ఏర్పడే ఖాళీ పోస్టుల్లోను వీరికి ప్రమోషన్లు ఇవ్వాలని తాము కోరుతూ, గతంలో ప్రమోషన్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎంకు తెలియజేశామని అన్నారు.

ఎక్కువ మందిచదివినవి