ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ సమాఖ్య ఉద్యోగులకు వీ ఆర్ ఎస్

(ఉద్యోగులు న్యూస్) 

ఆంధ్రప్రదేశ్ డెయిరీ అభివృద్ధి  సహకార సమాఖ్య  లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బుధవారం వీ ఆర్ ఎస్ ప్రకటించింది. గుజరాత్ తరహాలో ఈ వాలంటరీ రిటైర్ మెంట్ స్కీం అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది .  ఈ మేరకు విధివిధానాలతో  ప్రభుత్వ వ్యవసాయ, పశు సంవర్థకశాఖ ఉన్నతాధికారి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. 2021 ఫిబ్రవరి తర్వాత రి టైరయ్యే ఉద్యోగులకు మాత్రమే ఈ  వీ ఆర్ ఎస్ వర్తిస్తుంది. ఇంతవరకు పని చేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల వేతనం లేదా ఇక పని చేయాల్సిన కాలానికి ఏడాదికి 25 రోజుల వేతనం ఎక్స్గ్ గ్రేషియా గా ఇచ్చేందుకు నిర్ణయించారు.  ఈ రూపేణా వచ్చిన మొత్తం వారి పదవీవిరమణ చేయకుంటే  జీతాల రూపంలో  వచ్చే మొత్తం కన్నా ఎక్కువగా ఉండకూడదని నియమం విధించారు.