విద్యుత్తును ప్రయివేటీకరణ చేయబోం
* ఉద్యోగులకు అపోహలు వద్దు
* మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి
* బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ
(ఉద్యోగులు న్యూస్)
విద్యుత్తు ప్రయివేటీకరణ చేసేది లేదని, ఈ విషయంలో ఉద్యోగులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆంధ్రప్రదేశ్ విద్యుత్తుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి అన్నారు. రావాల్సిన బకాయిల సమస్య వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. బీసీ ఉద్యోగుల సమస్యలను సీఎండీతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఒంగోలులో బుధవారం ఆయన విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంఘం 2021 డైరీ, క్యాలండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్తు సెంట్రల్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కంపెనీ సీఎండీ పద్మా జనార్థన్ రెడ్డి, అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ వై వి రావు , బీసీ విద్యుత్తుఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు పి.వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఉపేంద్రం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి సంఘం జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.