రిఫెరల్ ఆసుపత్రుల సేవలు పునరుద్ధరణ 

(ఉద్యోగులు న్యూస్)
 

తితిదే ఉద్యోగులు, పెన్షనర్లు,  కుటుంబ పెన్షనర్లు వారిపై ఆధారపడిన వారి దంతవైద్యం కోసం  తిరుపతిలోని మూడు  రిఫెరల్ ఆసుపత్రుల సేవలను పునరుద్ధరిస్తూ దేవస్థానం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద ఉత్తర్వులు జారీ చేసారని  
: తితిదే ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది.  తిరుపతిలోని హరిప్రియ దంత వైద్యశాల, మేఘన మల్టి స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ , జేపీ డెంటల్ హాస్పిటల్ లలో వైద్యసేవలు పొందవచ్చని అసోసియేషన్ పేర్కొంది.