సీపీస్ రద్దు చేయమని కోరతా 

* ఎమ్మెల్యే 

(ఉద్యోగులు న్యూస్)
 


సీపీస్ రద్దు చేయాలని  ముఖ్యమంత్రి   దృష్టికి తీసికెళతానని ఎమ్మెల్యే  ఉషాశ్రీచరణ్ చెప్పారు.కళ్యాణదుర్గం ఏపీసీపీఎస్ఈఏ  జోనల్ శాఖ  ఆధ్వర్యంలో 2021కాలెండర్లను ఆమె  ఆవిష్కరించారు.   జోనల్ సెక్రటరీ నభిరసూల్ , రాష్ట్ర కౌన్సిలర్ జింకల మంజునాథ్ మాట్లాడుతూ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకూ సీపీఎస్  రద్దు పై ఎలాంటి నిర్ణయాన్ని  సీఎం  ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకు ఎమ్మెల్యే  మాట్లాడుతూ త్వరలోనే  సీపీఎస్   రద్దు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ అధ్యక్షురాలు శ అర్చన, ఆరు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు రాజగోపాల్,గురుమూర్తి, జగదీష్,మల్లికార్జున, పరమేశ్వర, రవి,,సంగప్ప,రంగప్ప,లోకేష్,గోపాల్ నాయక్,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.