ముఖ్యమంత్రి దృష్టికి  తీసుకెళ్తా

* కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులకు  ప్రవీణ్ ప్రకాష్ భరోసా 

(ఉద్యోగులు న్యూస్)


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని గత 20 ఏళ్లుగా  పనిచేస్తున్న  డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు రెగ్యులర్ చేసే అంశన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాతానని ముఖ్యమంత్రి  ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ హమీ ఇచ్చారని ఎంప్లాయిస్ జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆద్యాక్ష,ప్రదాన కార్యదర్శి కె.ఆర్. సూర్యనారాయణ, గొంతి అస్కా‌ర్ రావు గార్ల సహకారంతో జెఏసి రాష్ట్ర కన్వీనర్లు బృందం యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి, తమ్మినేని రమణారెడ్డి,కె.మదుసూదనరావు, ఏ.వి.శేషయ్య, బట్టు విజయవర్ధన్,రత్నకర్ బాబు,జి.వి.వి ప్రసాద్, జాన్ హెన్రీ బాబు, మోహన్,రాంబాబు, సుభాష్, చంద్రకిరణ్, వి.కిషోర్, విజయ తదితరులు కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపిజిఈఏ నాయకులు కె.ఆర్. సూర్యనారాయణ,జి.అస్కార్ రావు మాట్లాడుతూ మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళతామని, మీ సమస్య పరిష్కారమయ్యే వరకు మద్దతుగా ఉంటామని హమీ ఇచ్చారనితెలిపారు.